దంపతుల మధ్య విభేదాలు.. వేర్వేరు కాపురాలు.. ఇంట్లో ఏ మాత్రం అనారోగ్యం, అస్వస్థత కలిగినా భర్తే మంత్రాలు చేస్తున్నాడని భార్య అనుమానం.. అనుమానమే పెనుభూతమైంది.. మంత్రాలు చేసి ఇంటిళ్లిపాదిని చంపేస్తాడేమోనని భార్యే, భర్త హత్యకు పన్నాగం పన్నింది.. ఇదీ చౌటుప్పల్ మండలం లక్కారం శివారులో, దారుణంగా గొంతు కోసి హత్య చేసి, కాల్చేసి దొరికిన శవం మిస్టరీ. చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఉదయం పోలీస్ ఇన్‌స్పెక్టర్ భూపతి గట్టుమల్లు హత్యకేసు వివరాలు వెల్లడించారు. -చౌటుప్పల్
నల్లగొండలోని పానగల్లుకు చెందిన దండిగ లింగయ్య పెద్దకూతురు శాలిగౌరారం మండలం చెరువుమాదారం గ్రామానికి చెందిన సంకటి మల్లేష్(35)తో మొదట వివాహమైంది. కుమారుడు జన్మించాడు. ఈమె అనారోగ్యంతో చనిపోవడంతో, ఈమె సోదరి భారతమ్మ(30)ను ఇచ్చి వివాహం చేశారు. ఈమెకు ఇద్దరు కుమారులు. 2004లో దండిగ లింగయ్య, సంక టి మల్లేష్‌లు కుటుంబాలతో కలిసి చౌటుప్పల్‌కు వలస వచ్చారు. హనుమాన్‌నగర్‌లో అం తా ఒకేచోట నివాసమున్నారు. 2011లో మల్లేష్ తన మామను కొట్టడంతో, పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. అప్పటి నుంచి మల్లేష్ చౌటుప్పల్‌లోని మల్లికార్జున నగర్‌లో నివాసముంటున్నాడు. తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. భారత మ్మ మాత్రం తల్లిదండ్రులతోనే ఉంటోంది.
మల్లేష్ ఇటీవల నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి దేవాలయంలో నిత్య పూజలు చేస్తూ, జుట్టును ఏపుగా పెంచాడు. భారతమ్మ ఇం ట్లో ఎవరికి అనారోగ్యం వచ్చినా,అశుభం జరిగినా, మల్లేష్ మంత్రాలు(బాణామతి) చేయడం వల్లే ఇలా జరుగుతుందని ఇంటిళ్లిపా ది అనుకుంటున్నారు. ఈ క్రమంలో భారతమ్మ తన తండ్రి కుటుం బంతో పా టు తనను చేతబడి చేసి, మల్లేష్ చంపుతాడేమోనని అనుమానం పెరిగి పోయింది. ఇటీవల ఆమె తమ్ము డు దండిగ నాగరాజు(20)కు చిన్న ప్రమాదం అయితే, అది చేతబడి వల్లేనని నమ్మారు. దీం తో భారతమ్మ తన భార్త మల్లేష్‌ను అంతం చేయాలని తమ్ముడు నాగరాజుతో కలిసి కుట్రపన్నింది.
మల్లేష్ ఇంటికే వస్తానని చెప్పి..
హత్యకు 10రోజుల ముందు నుంచే భారతమ్మ మల్లేష్ ఉంటున్న ఇంటికి సామాను సదురుకొని వస్తానని సంకేతాలిచ్చింది. దీంతో మల్లేష్ ఇరుగుపొరుగు వారికి తన భార్య ఇంటికి వస్తానంటోందని చెప్పాడు. వారు వస్తే తీసుకొచ్చుకొమ్మని చెప్పారు. గత నెల 30వ తేదీన భారతమ్మ తన చిన్న కుమారుడితో కలిసి తాపీమేస్త్రీల అ డ్డాకు వచ్చింది. చిన్నకుమారుడు మల్లేష్‌ను కలి సి తాత, అమ్మ గొడవ పెట్టుకున్నారని, అమ్మ మన ఇంటికి వస్తానంటోంది అని చెప్పాడు. దీం తో మల్లేష్ సామాను తీసుకొచ్చుకుందామని భార్య వెనకాలే, 11గంటల సమయంలో మామ ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి రాగానే, కంట్లో కారం కొట్టి రోకలిబండతో తలపై బలంగా కొట్టింది.
నాగరాజు బిగ్గరగా పట్టుకున్నాడు. మల్లేష్‌కు మంత్రాలు వస్తాయని, ప్రాణం పోదని, గొంతు లో కాగితాలు ఉంటాయని, అవి తీస్తేనే, ప్రా ణం పోతుందని గొంతు కోశారు. చివరకు ప్రా ణం పోవడంతో, బట్టబొంతలో ముదిరి, గోనే సంచిలో వేచి మూతి కట్టారు. ఇల్లును శుభ్రం చేశారు. హత్యకు ఉపయోగించిన రోకలిబండ, కత్తిని దూరంగా పడేశారు. శవాన్ని ఇంటిలో నుంచి తీసుకెళ్లేందుకు, నల్లగొండలోని ప్రకాశంబజార్‌కు చెందిన సమీప బంధువు మున్న శ్రీకాంత్(21)కు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆటోను తీసుకొని రాత్రి ఇంటికి రమ్మని చెప్పి ంది. ఆయన తిప్పర్తి మండలం ఖాజిరామారం గ్రామానికి చెందిన షేక్ నయీమ్(21) ఆటోకు అద్దెకు తీసుకొని మంగళవారం రాత్రి 9.30గంటల సమయంలో చౌటుప్పల్‌కు వచ్చాడు. ఆలోపు భారతమ్మ లక్కారం శివారులోని నిర్జన ప్రదేశానికి వెళ్లి, శవాన్ని పడేయాల్సిన చోటును చూసి వచ్చింది.
రాత్రిపూట శవాన్ని ఆటోలో వేసుకొని, మృతదేహాన్ని అక్కడ వేసి పెట్రోల్ పోసి కాల్చి వెళ్లిపోయారు. మల్లేష్ కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారు వెతుకుతున్నారు. ఈ నెల 2న పోలీసులకు మృతదేహం లభ్యమవడం, అతని జుట్టు ఏపుగా పెరిగి ఉం డడం, స్థానికులు జుట్టు ఏపుగా ఉన్న వ్యక్తి మ ల్లేష్ అని పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకొని, విచారించడంతో నేరం అంగీకరించారు. భారతమ్మ, నాగరాజు, శ్రీకాం త్, షేక్ నయీంలను శనివారం రామన్నపేట కోర్టులో హాజరుపరిచా రు. జడ్జి ఆదేశాల మేరకు నల్లగొండ జైలుకు తరలించారు. ఐడీపార్టీ పోలీసులను సీఐ అభినందించారు. సమావేశంలో ఎస్‌ఐలు మల్లీశ్వరి, హ రిబాబు, యాదవరెడ్డి, ఈద్దయ్య, యాదగిరి, తి రుపతిరావు, శ్రీనివాస్, సైదులు పాల్గొన్నారు.
అనుమానమే పెనుభూతమై..
Published Sun, Jul 5 2015 2:51 AM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM
Advertisement