నెల్లూరు: కొందరు గుర్తుతెలియని దుండగులు తహశీల్దార్ కార్యాలయంలోని దస్త్రాలకు నిప్పంటించిన సంఘటన నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండల కార్యాలయంలో ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది ఈ విషయాన్ని గమనించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా.. గతంలో కూడా ఈ కార్యాలయంలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఈ విషయం పై కార్యాలయ సిబ్బందిని వివరణ కోరగా.. ఇవి గతంలో కాలిన పత్రాలే కావడంతో ఎలాంటి ప్రమాదం లేదని అంటున్నారు.