
అన్నివిధాల అండగా ఉంటా
బాణసంచా ప్రమాద బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
నెల్లూరు: బాణసంచా యూనిట్ దగ్ధమై మృతి చెందిన వారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసాయిచ్చారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని పెన్నానది పొర్లుకట్ట ప్రాంతంలో శనివారం జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా జగన్ పరామర్శించారు.