వంట చేస్తుండగా మంటలు అంటుకుని.. | fire while cooking in nellore | Sakshi
Sakshi News home page

వంట చేస్తుండగా మంటలు అంటుకుని..

Published Fri, Aug 18 2017 11:17 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

వంట చేస్తుండగా మంటలు అంటుకుని.. - Sakshi

వంట చేస్తుండగా మంటలు అంటుకుని..

► నాలుగు పూరిల్లు దగ్ధం 
నెల్లూరు సిటీ: వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు పూరింటికి మంటలు అంటుకుని పక్కనే ఉన్న మరో మూడు ఇళ్లు అగ్నికి ఆహుతైన ఘటన భక్తవత్సలనగర్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. భక్తవత్సల్‌నగర్‌లోని సంగమిత్రా పాఠశాల వెనుకవైపున పలువురు పేదలు పూరిళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. గురువారం ఉదయం ఓ ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మం టలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదు.

దీంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.  అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేలోగానే పీ శీనయ్య, పీ అనీల్, వై మధు ఎస్‌కే గపూర్‌కు చెందిన పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.  ఈ ప్రమాదంలో నాలుగు ఇళ్లలోని టీవీలు, గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.2లక్షలు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement