తహశీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
Published Wed, Nov 23 2016 8:26 AM | Last Updated on Thu, Apr 4 2019 3:02 PM
కర్నూలు: జిల్లాలోని ఆళ్లగడ్డ తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. కార్యాలయంలోని కంప్యూటర్లు, ముఖ్యమైన పత్రాలు కాలి బూడిదయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Advertisement
Advertisement