మండల పరిధిలోని తూముకుంట, వెలిగల్లులో సోలార్ పనులు ప్రారంభం అయ్యాయి. రైతుల భూములకు తహసీల్దార్ కార్యాలయంలో ఆన్‌లైన్ అయిన 1బి రికార్డుల జాబితా ప్రకారం తూముకుంట, వెలిగల్లు సోలార్ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు సోలార్ ప్రాజెక్టు ఎస్‌ఈ నారాయణమూర్తి తెలిపారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ భవానీతో పెండింగ్ జాబితాపై చర్చించారు.
గాలివీడు : మండల పరిధిలోని తూముకుంట, వెలిగల్లులో సోలార్ పనులు ప్రారంభం అయ్యాయి. రైతుల భూములకు తహసీల్దార్ కార్యాలయంలో ఆన్‌లైన్ అయిన 1బి రికార్డుల జాబితా ప్రకారం తూముకుంట, వెలిగల్లు సోలార్ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు సోలార్ ప్రాజెక్టు ఎస్‌ఈ నారాయణమూర్తి తెలిపారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ భవానీతో పెండింగ్ జాబితాపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందులో మైలవరంలో 1000మెగావాట్లకు సంబంధించి రైతుల భూముల జాబితా సిద్ధం చేశామన్నారు. తూముకుంట, వెలిగల్లులో 500మెగావాట్లకు సంబంధించి మూడు సబ్‌స్టేషన్లు, భూములకు హద్దులు, అమర్‌రాజ కంపెనీ వారు పనులను ప్రారంభించారన్నారు. సోలార్‌కు తూముకుంట, వెలిగల్లు గ్రామ రైతులు సహకరించాలని కోరారు. పెండింగ్ జాబితాను కూడా త్వరలో ఉన్నతాధికారులకు పంపించేవిధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో తూముకుంట సోలార్ ఏడీ శంకర్‌నాయుడు, సీనియర్ అకౌంటెంట్ విజయకుమార్, ఆర్‌ఐ యునీత్‌కుమార్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రాణాప్రతాప్‌రెడ్డిలు పాల్గొన్నారు.