కర్నూలు జిల్లా బనగానపల్లి రెవెన్యూ కార్యాలయ ఉద్యోగుల తీరుతో విసిగి సోమవారం ఆత్మాహుతి చేసుకున్న రైతు కుటుంబానికి తగిన సాయం చేసేందుకు ప్రభుత్వం దిగొచ్చింది.
బనగానపల్లి : కర్నూలు జిల్లా బనగానపల్లి రెవెన్యూ కార్యాలయ ఉద్యోగుల తీరుతో విసిగి సోమవారం ఆత్మాహుతి చేసుకున్న రైతు కుటుంబానికి తగిన సాయం చేసేందుకు ప్రభుత్వం దిగొచ్చింది. రైతు బలరాములు మృతదేహంతో కుటుంబ సభ్యులు, రాళ్ల కొత్తూరు గ్రామస్తులు మంగళవారం బనగానపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్, జేసీ హరికిరణ్ మంగళవారం సాయంత్రం బనగానపల్లికి చేరుకుని బలరాములు కుటుంబసభ్యులతో మాట్లాడారు.
రెండెకరాల ప్రభుత్వ భూమి ఇస్తామని, సీఎం సహాయనిధి నుంచి రూ.5 లక్షల పరిహారం ఇప్పిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. తన పొలానికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కోరుతూ బలరాములు మూడు రోజులగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పని కాకపోవడంతో విసిగి సోమవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకోగా, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు.