అనంతపురం : అధికారం అండగా ఉందనే భరోసాతో తెలుగు తమ్ముళ్లు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. తాజాగా బుధవారం అనంతపురం తహశీల్దార్‌పై దాడికి దిగారు. వివరాల్లోకి వెళ్తే...అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎంపీటీసీ కాటన్నెకాలువ శ్రీనివాస్ ఓ భూ వివాదానికి సంబంధించిన అంశంలో జోక్యం చేసుకుని ఎమ్మార్వోతో వాగ్వాదానికి దిగాడు. అదే క్రమంలో.. కార్యాలయంలోకి వచ్చిన తహశీల్దార్ మహబూబ్ పాషాను దుర్భాషలాడుతూ, అతని కాలర్ పట్టుకున్నాడు. దీంతో మనస్థాపం చెందిన అధికారి సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.