తహశీల్దార్ కార్యాలయం దిగ్బంధం | mro office occupied by the people | Sakshi
Sakshi News home page

తహశీల్దార్ కార్యాలయం దిగ్బంధం

Published Thu, Feb 12 2015 3:37 PM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM

mro office occupied by the people

నల్లగొండ: ఆహారభద్రత కార్డుల మంజూరులో అలక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ ప్రజలు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామస్తులు సుమారు 100 మంది మండల కేంద్రానికి తరలివచ్చారు. ఆహారభద్రత కార్డులను మంజూరు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. తహశీల్దార్ వీర ప్రతాప్‌ను కార్యాలయం లోనే బంధించి వారంతా కార్యాలయం వెలుపల  బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

(తుర్కపల్లి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement