
ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి
అనంతపురం: రాష్ట్రంలో ఇసుక ధరల పెంపును నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు మంగళవారం హిందూపురంలోని ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి స్థానిక వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ మద్దతు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతుంటే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు.