సాక్షి, మెదక్ : తన భూమికి సంబంధించిన పట్టా పాస్ బుక్ ఇవ్వడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి ఆగ్రహం వ్యక్తం చేశాడు. నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన లంబాడి కిషన్ అనే వ్యక్తిని సంవత్సర కాలం నుచి ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ భూమికి సంబంధించిన పాస్ బుక్ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. ఎమ్మార్వో భిక్షపతి కనీనం కనికరం లేకుండా దురుసుగా మాట్లాడారని, తన పాస్ పుస్తకం రాబట్టుకోడానికి వేరే మార్గం కనిపించకనే టవర్ ఎక్కినట్లు బాధితుడు కిషన్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఎమ్మార్వో పాస్ పుస్తకం ఇస్తానని హామీ ఇచ్చినా, కిషన్ మాత్రం విద్యుత్ టవర్ దిగడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment