
ఎమ్మార్వో కార్యాలయంలో పాము కలకలం
నెల్లూరు జిల్లా చేజర్ల తహసీల్దార్ కార్యాలయంలో పాము కలకలం సృష్టించింది.
నెల్లూరు : నెల్లూరు జిల్లా చేజర్ల తహసీల్దార్ కార్యాలయంలో పాము కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం అధికారులు, సిబ్బంది తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలో పాము దర్శనమిచ్చింది. దీంతో అధికారులు... సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. పాము పట్టుకునేందుకు స్నేక్ సొసైటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది అధికారులు తెలిపారు. దీంతో కార్యాలయం బయటే అధికారులు సిబ్బంది... పడిగాపులు పడుతున్నారు.