![Clashes Between Tahsildar Office Employees In Jogulamba District - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/28/Jogulamba.jpg.webp?itok=k3v4izgd)
సాక్షి, గద్వాల: ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు కర్తవ్యం మరిచారు. ఒకరికొకరు సమన్వయంతో పనిచేయాల్సిందిపోయి సోయి మరచి వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని తహసిల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో వెలుగు చూసింది. సర్వేయర్ బ్రహ్మయ్య, సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ పరస్పరం బండ బూతులతో రచ్చకెక్కారు. అధికారుల తిట్ల పురాణాన్ని పనుల నిమిత్తం వచ్చిన కొందరు వ్యక్తులు వీడియో తీసి బయటపెట్టడంతో.. అది కాస్తా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు ఇలా గొడవపడటంపై జనం మండిపడుతున్నారు. పైఅధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment