
సాక్షి, నాగర్ కర్నూలు : జిల్లాలోని కోడేర్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయానికి గత వారం రోజులుగా అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడట్లేదు. ఈ చర్యలతో
ఆగ్రహించిన రైతులు కార్యాలయానికి తాళాలు వేసి తమ నిరసనను తెలియజేశారు. అధికారులు మమ్మల్ని మనుషులుగా కాకుండా, మా పట్ల హేళనగా చూస్తున్నారని
రైతులు ఆవేదన చెందారు. కొత్తగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకానికి సంబంధించి మాకు ఎటువంటి చెక్కులు అందట్లేదని, చెక్కులు ఇవ్వకున్నా పరవాలేదు
కనీసం మా భూముల పట్టాదారు పాస్ పుస్తకాలు అయినా మాకు ఇవ్వాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment