ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని తమకు న్యాయం చేయాలని ఇసుక రవాణాదారులు తహశీల్దార్ ను కోరారు.
విజయనగరం: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని తమకు న్యాయం చేయాలని ఇసుక రవాణాదారులు తహశీల్దార్ ను కోరారు. విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో గురువారం ఇసుక రవాణాదారులు వాహనాలతో వచ్చి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అధికారులు నిబంధనలను పాటించటం లేదని, వారి తీరు కారణంగా తమకు గిట్టుబాటు కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా ఛార్జీలు కూడా గిట్టుబాటు కావటం లేదని అధికారులకు తెలిపారు. కాగా చంపావతీ నదీ తీరం ఉన్న గుర్ల మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఐదు ఇసుక రీచ్‌లు ఉన్నాయి.
(గుర్ల)