కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతులు మంగళవారం సాయంత్రం ఆందోళనకు దిగారు.
ఆస్పరి (కర్నూలు) : కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతులు మంగళవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. పేర్లు నమోదు చేసుకున్నా పట్టాదారు పాసుపుస్తకాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని వారు నిరసన వ్యక్తం చేశారు.
మండలంలోని ములుగుండం, వలగొండ, బిల్వకల్లు తదితర గ్రామాలకు చెందిన సుమారు 80 మంది రైతులు మండల కార్యాలయానికి తరలివచ్చారు. అయితే తహశీల్దార్ కార్యాలయంలో లేకపోవటంతో అక్కడి అధికారులకు తమ సమస్య వివరించి వెనుదిరిగారు.