కర్నూలు జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఎర్రుపాళెం ఎమ్మార్వో కార్యాలయం వద్ద సత్యనారాయణ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకున్నాడు.
కర్నూలు: కర్నూలు జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఎర్రుపాళెం ఎమ్మార్వో కార్యాలయం వద్ద సత్యనారాయణ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకున్నాడు.
గ్రామ శివారులోని గ్రామకఠం భూములు ఆక్రమణకు గురయ్యాయని, వాటిలో ఆక్రమణలు తొలగించి దళితులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సత్యనారాయణ నాయకత్వంలో 50 మంది ధర్నాకు దిగారు. అధికారులు పట్టించుకోకపోవడంతో అతను వెంట తెచ్చుకున్న కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతనిని వారించారు. ఎమ్మార్వో సమ్మిరెడ్డి అతనిని కార్యాలయానికి పిలిపించుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు.