మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంపై మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు.
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంపై మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా రైతు నుంచి రూ. 3 వేలు లంచం తీసుకుంటున్న వీఆర్వో కాశీనాథ్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నగదు సీజ్ చేసి... కాశీనాథ్ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.