కురవి ఆర్‌ఐకి బెదిరింపు మెసేజ్
కురవి ఆర్‌ఐకి బెదిరింపు మెసేజ్
Published Wed, Aug 24 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
కురవి : మండల రెవెన్యూ కార్యాల యం లో విధులు నిర్వహించే ఆర్‌ఐ ఫిరోజ్‌కు మంగళవారం సాయంత్రం బెది రింపు మెసేజ్ వచ్చింది. భయంతో అతడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కథనం ప్రకారం.. కురవి ఆర్‌ఐ ఫిరోజ్ ఈ నెల 5వ తేదీన విధులు నిర్వహించుకుని మానుకోటకు బైక్‌పై వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారం పొడిని చల్లారు. ఈ ఘటనపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఆర్‌ఐ ఫిరోజ్ సెల్‌కు ఒక బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఈ రకంగా ఉంది. ‘ఓరి లంచగొండి సన్నాసి... ఫిరోజ్‌గా ఎలా ఉందిరా కారం మంటా ?’ అంటూ ఉంది. అలాగే రూ.5 లక్షలు ఈ నెల 25వ తేదీ సాయంత్రం లోగా మాకు అప్పగించాలి.. లేదో కాళ్లు, చేతులు నరికేస్తాం ఖబర్ధార్’ అంటూ మెసేజ్ పంపారు. 7702564615 నంబర్ నుంచి రెండు సార్లు ఈ మెస్సెజ్ పంపించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్‌ఐ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని కోరారు.
Advertisement
Advertisement