ri
-
'లంచం అడిగిన ఆర్ఐ..' సోషల్ మీడియాలో వాయిస్ వైరల్!
ఖమ్మం: వ్యవసాయ క్షేత్రంలో బోరు బావి ఉన్నట్లు ధ్రువీకరణ పత్రంపై సంతకం చేయడానికి దమ్మపేట మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు చేసిన ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మండలంలోని మందలపల్లికి చెందిన మడిపల్లి వెంకటేశ్వరరావు మల్లారంలోని మట్టా ధనదుర్గకు చెందిన ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఆ భూమిలో పాత బోరు బావి ఉండగా విద్యుత్ కనెక్షన్ తీసుకునేందుకు ఆర్ఐ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్‌ఐకు ఇరవై రోజుల కిందట వెంకటేశ్వరరావు దరఖాస్తు చేసుకోగా రూ.10 వేలు డిమాండ్ చేశాడు. దీంతో రైతు అంత డబ్బు ఇవ్వలేనని బదులివ్వగా రూ.6 వేలైనా ఇవ్వాలని సూచించాడు. ఇదంతా ఫోన్లో రికార్డు చేయడంతోపాటు వీడియో చిత్రీకరించగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బుధవారం ఆర్ఐ ధ్రువీకరణ పత్రంపై సంతకం చేసి ఆడియో, వీడియోలు తొలగించాలని కోరాడు. ఈ విషయమై ఆర్ఐని వివరణ కోరగా వాయిస్ రికార్డు చేస్తారని అనుకోలేదని, ఏదో అలా జరిగిపోయిందంటూ బదులివ్వడం గమనార్హం. ఇక తహసీల్దార్ ఎండీ.ముజాహిద్ మాట్లాడుతూ ఆర్ఐ డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిసిందని, రైతు నుంచి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఇవి చదవండి: వెళ్లిన నెల రోజులకే.. ఇంటికి తిరిగొచ్చిన శవపేటిక! -
ఎమ్మెల్యే చెబితేనే జాయినింగ్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ‘బదిలీపై వచ్చావా..? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫారసు లెటర్ ఉందా? బదిలీ లెటర్ తెచ్చినా... వారు చెపితేనే విధుల్లో చేర్చుకుంటా!’ అని ఓ తహసీల్దార్ గిర్ధావర్ (రెవెన్యూ ఇన్స్పెక్టర్ను వెనక్కు పంపడం మంచిర్యాల జిల్లా రెవెన్యూ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల జిల్లాలో చేపట్టిన రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా జన్నారం మండలంలో ఆర్ఐగా పనిచేసిన ఎం.మోహన్‌ను తొలుత భీమినికి బదిలీ చేశారు. మోహన్ విజ్ఞప్తి మేరకు స్వల్ప మార్పులతో భీమిని నుంచి జైపూర్ మండలానికి బదిలీ చేస్తూ గత నెల 29న కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈ మేరకు మోహన్ మే 31న జైపూర్ తహసీల్దార్ శేఖర్‌ను కలిసి విధుల్లో చేర్చుకోవాలని కోరగా, అందుకు నిరాకరించడం వివాదాస్పదమైంది. ‘ఎన్నికల సంవత్సరం ఇది. ఎమ్మెల్యే (నల్లాల ఓదెలు), ఎమ్మెల్సీ (పురాణం సతీష్)ల అనుమతి లేకుండా నిన్ను విధుల్లో చేర్చుకోలేను. వారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. వారి నుంచి లెటర్ తీసుకువస్తేనే జాయిన్ చేసుకుంటా’ అని తహసీల్దార్ శేఖర్ తనను వెనక్కు పంపారని శనివారం ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చిన మోహన్ వివరించారు. ఆరోజు జైపూర్ తహసీల్ కార్యాలయం పరిశీలనకు వచ్చిన జాయింట్ కలెక్టర్‌కు ఈ విషయాన్ని తెలియజేశానని, కలెక్టర్ ప్రొసీడింగ్స్‌ను తిరస్కరించకూడదని జేసీ హితువు చెప్పారని వివరించారు. జేసీ ముందు జాయిన్ చేసుకుంటానని చెప్పి తరువాత మళ్లీ వెనక్కు పంపారని తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఆర్వీ.కర్ణన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తే ఏవో, ఆర్డీవోలకు కలెక్టర్ ఆదేశాలిచ్చారని మోహన్ తెలిపారు. కాగా శనివారం తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు గిర్ధావర్ హోదాలో జైపూర్‌కు వెళ్లగా, ఆఫీసులో కూర్చున్న తనను జాయిన్ చేసుకోలేనని చెప్పి మళ్లీ తహసీల్దార్ వెనక్కు పంపారని తెలిపారు. కలెక్టర్ బదిలీ ఉత్తర్వులను తీసుకొని వెళితే తనను విధుల్లో చేరకుండా అడ్డుకొని వెనక్కు పంపడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తనను బెదిరిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు : తహసీల్దార్ శేఖర్ బదిలీ ఉత్తర్వులతో వచ్చిన గిర్దావర్ మోహన్ విధుల్లో చేరకముందే తన పై అధికారి అనే గౌరవం కూడా ఇవ్వకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జైపూర్ తహసీల్దార్ శేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. గిర్ధావర్ ఆరోపణలపై వివరణ కోరగా... తనకు తెలియకుండా ఎవరిని విధుల్లో చేర్చుకోవద్దని ఓ ప్రజాప్రతినిధి చెప్పిన మాటలనే మోహన్‌కు చెప్పానని స్పష్టం చేశారు. ఈ మాటలకు తప్పుడు ప్రచారం చేస్తూ అధికార పార్టీ పేరును, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్ పేర్లను వివాదాస్పదం చేశాడని పేర్కొన్నారు. ‘జరిగిన పరిణామాలను కలెక్టర్‌కు నివేదించాను. కలెక్టర్ నుంచి నాకు తదుపరి ఆదేశాలు ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలోనే శనివారం మండల కార్యాలానికి వచ్చిన గిర్ధావర్ మోహన్‌ను విధుల్లో చేర్చుకోలేదు’ అని వివరించారు. -
కోరిక తీరిస్తేనే కులధ్రువీకరణ
సాక్షి, రాయగడ: రాయగడకు 140కిలోమీటర్ల దూరంలో గల మారుమూల చంద్రపూర్ సమితి తహసీల్ విభాగానికి చెందిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆగడాలు పెచ్చుమీరాయి. కులధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయానికి వచ్చే బాలికలను శారీరక కోరిక తీర్చాలని వేధిస్తున్నాడంటూ అభియోగాలు వస్తున్నప్పటికీ తాను ఒడియా పత్రిక విలేకరిగా కూడా పనిచేస్తున్నానని చెప్పుకుంటూ అభియోగాలను కప్పిపుచ్చుకుంటున్నాడు. దీనిపై ఈ నెల 12 వతేదీన ఇద్దరు ఆదివాసీ బాలికలు చంద్రపుర్ సమితి బీడీఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రపుర్ సమితిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సుఖాంత్బెహరా వద్దకు కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఇద్దరు బాలికలు వెళ్లగా తన శారీరక కోరికను తీరిస్తే కుల ధ్రువీకరణ పత్రాలిస్తానని లేదంటే ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఆందోళన చెదిన వారు కలెక్టర్‌కు, బీడీఓకు, పోలీసు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గతంలో ఓసారి సస్పెన్షన్ సుఖాంత్ బెహరా గతంలో ఆదివాసీ కులధ్రువీకరణ పత్రాలను మంజూరు చేసేందుకు ఒకొక్కంటికి రూ.20వేలు లంచం తీసుకుకుని మంజురు చేసేవాడన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇతర సాధారణ సర్టిఫికెట్లకు రూ.1000 నుంచి లంచాలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో పలుమార్లు మహిళలను వేధించిన విషయంలో అనేక ప్రాంతాల్లో అతనికి దేహశుద్ధి కూడా జరిగింది. గతంలో ఒకసారి ఈ ఘటనలపై విధుల నుంచి సస్పెండ్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్ఐ సుఖాంత్బెహరాపై విజిలెన్స్ విచారణ జరపాలని చంద్రపూర్ సమితి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన నరసాపురం ఆర్ఐ
నరసాపురం : జనన ధ్రువీకరణ పత్రం కోసం రూ.ఐదువేలు లంచం డిమాండ్ చేసిన నరసాపురం ఆర్ఐ జి.పెద్దిరాజును బుధవారం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతనిని అరెస్ట్‌చేసి విజయవాడకు తరలించారు. విజయవాడ ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ కథనం ప్రకారం.. మొగల్తూరు మండలం ముత్యాలపల్లికి చెందిన కొల్లాటి ఆనంద్ కుమార్ ఇటీవలే ఐటీఐ పూర్తి చేశాడు. అతను జనన ధ్రువీకరణ పత్రం కోసం యత్నించాడు. పుట్టినప్పుడు నమోదు చేయకపోవడంతో, సబ్‌కలెక్టర్ కార్యాలయం ద్వారా లేట్ బర్త్ç సర్టిఫికెట్ కావాలంటూ దరఖాస్తు చేశాడు. నిబం««దlనల ప్రకారం, అన్ని సర్టిఫికెట్లు జతచేసి, తాను పుట్టిన నరసాపురం మండలం వేములదీవి నుంచి అక్టోబర్‌లో మీసేవా కేంద్రం ద్వారా దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే ఆర్ఐ పెద్దిరాజు దీనికోసం రూ.5వేలు డిమాండ్ చేశారు. అవి ఇస్తేనే కానీ పని జరగదని తిప్పించుకుంటున్నారు. దీంతో ఆనంద్‌కుమార్ ఏలూరులోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కొత్త నోట్లతో దొరికిన ఆర్ఐ.. దీంతో ఏసీబీ విజయవాడ డీఎస్పీ గోపాలకృష్ణతోపాటు, రాజమండ్రి డీఎస్పీ ఎం.సుధాకర్‌రావు సిబ్బందితో కలిసి వలపన్నారు. బుధవారం సాయంత్రం ఆనంంద్ కుమార్‌కు రెండు రూ.2వేల కొత్తనోట్లు, మరో పది రూ.100లు నోట్లు ఇచ్చి పంపారు. తహసీల్దార్ కార్యాలయంలోని తన సీటు వద్దే ఆ సొమ్ము తీసుకుంటూ పెద్దిరాజు ప్రత్యక్షంగా దొరికినట్టు గోపాలకృష్ణ వివరించారు. ఆర్ఐపై చాలా ఫిర్యాదులున్నాయని చెప్పారు. పెండింగ్‌లో చాలా ధ్రువీకరణపత్రాలు ఉన్నాయని, వాటిపైనా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆర్ఐ వల్ల ఇంకా ఎవరైనా ఇబ్బందులు పడితే, తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇదిలా ఉంటే ఏసీబీ దాడి ఉద్యోగవర్గాల్లో కలవరం రేపింది. -
లైంగిక వేధింపుల అభియోగంపై ఆర్ఐకి చార్జిమెమో
కర్నూలు : జిల్లా పోలీసు శాఖలోని ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో పనిచేస్తున్న ఆర్ఐకి ఎస్పీ ఆకే రవికృష్ణ చార్జిమెమో జారీ చేశారు. ఈ సంఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేస్తున్న స్వీపర్ల నుంచి ఆర్ఎస్ఐ ద్వారా నెల మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. మామూళ్లతో పాటు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ కొంతమంది మహిళలు డీఐజీ రమణకుమార్‌ను కలిసి విన్నవించుకున్నారు. ఆయన ఆదేశాలతో ఎస్పీ 8 పేజీలతో కూడిన చార్జిమెమోను జారీ చేసి వారంలోగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నట్లు సమాచారం. ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో ఆరుగురు ఇన్స్పెక్టర్లు ఉండాల్సి ఉంది. ప్రస్తుతం ముగ్గురు ఉన్నారు. ఈనెల మొదటి వారంలో బాధ్యతలు చేపట్టిన ఆర్ఐ రాంబాబు డిప్యూటేషన్‌పై హైదరాబాదు వెళ్లారు. డీఎస్పీ అశోక్‌బాబు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ విజయవాడకు బదిలీపై వెళ్లారు. దీంతో ఒక ఆర్ఐ మహిళా సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఎస్పీ చార్జి మెమో జారీ చేసినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. -
కురవి ఆర్ఐకి బెదిరింపు మెసేజ్
కురవి : మండల రెవెన్యూ కార్యాల యం లో విధులు నిర్వహించే ఆర్ఐ ఫిరోజ్‌కు మంగళవారం సాయంత్రం బెది రింపు మెసేజ్ వచ్చింది. భయంతో అతడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కథనం ప్రకారం.. కురవి ఆర్ఐ ఫిరోజ్ ఈ నెల 5వ తేదీన విధులు నిర్వహించుకుని మానుకోటకు బైక్‌పై వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారం పొడిని చల్లారు. ఈ ఘటనపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఆర్ఐ ఫిరోజ్ సెల్‌కు ఒక బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఈ రకంగా ఉంది. ‘ఓరి లంచగొండి సన్నాసి... ఫిరోజ్‌గా ఎలా ఉందిరా కారం మంటా ?’ అంటూ ఉంది. అలాగే రూ.5 లక్షలు ఈ నెల 25వ తేదీ సాయంత్రం లోగా మాకు అప్పగించాలి.. లేదో కాళ్లు, చేతులు నరికేస్తాం ఖబర్ధార్’ అంటూ మెసేజ్ పంపారు. 7702564615 నంబర్ నుంచి రెండు సార్లు ఈ మెస్సెజ్ పంపించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్ఐ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
నల్లగొండ: ఎన్ఓసీ సర్టిఫికెట్ జారీ చేయడానికి లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కరుణ వెంకట్‌రెడ్డి రోడ్డు పక్కన ఉన్న తన మూడున్నర గుంటల స్థలాన్ని తన కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడానికి ప్రయత్నించగా.. ఎన్ఓసీ సర్టిఫికెట్ అవసరం వచ్చింది. దీంతో ఆర్ఐ కృష్ఱని సంప్రదించగా.. రూ. 20 వేలు ఇస్తే వెంటనే ఇస్తాననడంతో.. తన దగ్గర అంత లేవని రూ. 5 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని ఏసీబీకి సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆర్ఐ లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్ఐ కృష్ణను అదుపులోకి తీసుకుని ఏసీబీ డీఎస్సీ కోటేశ్వర్రావు విచారణ చేపడుతున్నారు. -
‘నిప్పు’లాంటి నిజం
నంద్యాల మునిసిపాలిటీలో భారీగా ఆస్తి పన్ను స్వాహా! నంద్యాల టౌన్: పాలకవర్గం లేకపోవడం.. పర్యవేక్షణ కొరవడంతో నంద్యాల ముసిసిపాలిటీలో కొందరు సిబ్బంది అక్రమ మార్గం పట్టారు. ఆస్తులు కూడబెట్టుకొనేందుకు అడ్డదారులు తొక్కారు. విధి నిర్వహణలో లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఉపాధినిచ్చిన మునిసిపాలిటీకే నమ్మక ద్రోహం చేశారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులతో కుమ్మక్కై భారీ మొత్తాన్ని మింగేశారు. ఈ కుంభకోణం వెలుగులోకి రాకుండా చేయడానికి రికార్డుల గదిని సైతం తగలబెట్టారు. అయితే నిప్పులాంటి నిజం ఆడిట్లో బయట పడింది. కేవలం 350 అసెస్మెంట్లను పరిశీలించగా దాదాపు రూ.7 లక్షలు కాజేసినట్లు వెలుగు చూసింది. మునిసిపాలిటీలో దాదాపు 35 వేలకు పైగాకు అసెస్మెంట్లు (ఆస్తి పన్ను ఖాతాలు) ఉండగా వీరు కాజేసిన మొత్తం రూ. 6 కోట్లు ఉండవచ్చని అంచనా. పన్ను వసూలు ఇలా.. ప్రతి ఏడాది కొత్తగా నిర్మించిన దుకాణాలు, భవనాలు, అపార్ట్మెంట్లకు మునిసిపాలిటీ పన్ను విధిస్తుంది. మున్సిపల్ బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ భవనాల వద్దకు వెళ్లి కొలతలు వేసి పన్ను విధిస్తారు. ఈ పన్నును మిస్లీనియేస్ బుక్‌లో(ఎంఎల్) నమోదు చేస్తారు. తర్వాత అసెస్మెంట్ వివరాలు, కొలతలు, పన్ను మొత్తాన్ని ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తారు. ఈ ఆన్లైన్ విధానం ద్వారా ఆస్తి యజమాని ప్రతి ఆరు నెలలకు ఒకసారి పన్ను చెల్లించాలి. నంద్యాల మునిసిపాలిటీలో ఏటా దాదాపు రూ.7 కోట్లకు పైగా పన్ను వసూలు అవుతుంది. ఆన్లైన్లో అవకతవకలు.. మునిసిపాలిటీలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు కుమ్మక్కయ్యారు. కొత్త భవనాలు, షాప్రూంలు, అపార్ట్మెంట్లకు పన్ను విధించి.. వాటిని ఆన్‌లైన్‌తో అనుసంధానం చేసే విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. ఉదాహరణకు ఒక షాప్రూం కొలతలు కొలిచి దాదాపు రూ.5 వేలు పన్నును నిర్ణయించారు. ఈ మేరకు బిల్ కలెక్టర్లు, ఆర్ఐలు ఎంఎల్ బుక్‌లో రూ.5 వేలు పన్ను విధించినట్లు నమోదు చేశారు. తర్వాత ఆస్తి యజమానితో కుమ్మక్కై, మామూళ్లు దండుకొని రూ.5 వేల పన్నును రూ.500కు తగ్గించేశారు. ఈ మేరకు రూ.500 పన్ను విధించినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రతి ఆరు నెలలకు ఆస్తి యజమాని కేవలం రూ.500 పన్నుల మాత్రమే చెల్లిస్తున్నారు. మిగతా రూ.4500 మున్సిపాలిటీ నష్టపోతుంది. ఇలా 2011-12, 2012-13లలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. రికార్డుల గదికి నిప్పు.. అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండటానికి రెవెన్యూ సిబ్బంది రికార్డులను తగలబెట్టినట్లు తెలిసింది. ఆడిటింగ్ అధికారులు ఆరు నెలల నుంచి మున్సిపాలిటీలోని విభాగాల వారీగా రికార్డులను పరిశీలిస్తున్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్ పక్కనే ఉన్న రికార్డుల రూపంలో ఎంఎల్ పుస్తకాలు ఉన్నాయి. మునిసిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించి రికార్డుల గదికి తాళాలు వేయకపోవడం, వరండాలో రికార్డులను చెల్లా చెదురుగా చెత్తకుప్పలా విసిరేశారు. దీంతో గత నెల 11న ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఎంఎల్ పుస్తకాలను తగలబెట్టినట్లు తెలిసింది. దీంతో అగ్నిప్రమాదం సంభవించి ఎంఎల్ పుస్తకాలతో పాటు మరికొన్ని రికార్డులు దగ్ధమయ్యాయి. అయితే కుంభకోణానికి పాల్పడిన సిబ్బంది ఆడిటింగ్‌కు చిక్కారు. 2011-13 సంవత్సరాలకు సంబంధించిన ఎంఎల్ బుక్‌లను, ఆన్లైన్ అసెస్మెంట్ వివరాలను తనిఖీ చేసిన ఆడిటింగ్ అధికారులు అక్రమాలను చూసి షాక్‌కు గురయ్యారు. ఎంఎల్ బుక్‌లో ఒక పన్ను మొత్తం ఉంటే, ఆన్లైన్లో అతి తక్కువ మొత్తం నమోదై ఉంది. ఆన్లైన్లో ఉన్న పన్నునే మున్సిపల్ అధికారులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వసూలు చేస్తున్నారు. ఇద్దరు ఆర్ఐలు, నలుగురు బిల్కలెక్టర్లు సూత్రధారులు... ఈ కుంభకోణంలో ఇద్దరు ఆర్ఐలు, నలుగురు బిల్ కలెక్టర్లు సూత్రధారులైనట్లు ఆడిటింగ్ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఒక ఆర్ఐ బదిలీపై ఏడాదిన్నర క్రితం వెళ్లారు. మరో ఆర్ఐ నంద్యాలలోనే విధులను నిర్వహిస్తున్నారు. మినిట్స్‌బుక్ అదృశ్యమైన కేసులో ఒక ఆర్ఐ సస్పెండ్ కావడంతో, ప్రస్తుతం ఉన్న ఆర్ఐ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆర్ఐ గతంలో కూడా స్టేషనరీ కుంభకోణానికి పాల్పడి సస్పెండ్ అయ్యారు. ్రపస్తుతం ఆడిట్ అధికారులు ఈ కుంభకోణానికి సంబంధించిన నివేదికను రూపొందించి, రహస్యంగా ఉంచారు. మరో రెండు మూడు రోజుల్లో నివేదిక పురలపాలక శాఖ రీజనల్ డెరైక్టర్ మురళీకృష్ణగౌడ్‌కు పంపడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నివేదికను ఆయన పరిశీలించి సిబ్బందిపై వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
అవినీతి కేసులో ఆర్ఐ అరెస్ట్
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: పాఠశాల భవనం గుర్తింపు రెన్యువల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి రూ.2 వేలు లంచం తీసుకున్న కీళంబాక్కం ఆర్ఐని పోలీసులు అరెస్టు చేశారు. కాంచీపురం జిల్లా మామల్లపురానికి చెందిన కన్నన్, మామల్లపురం సమీపంలో పుదుఎడయూర్ కుప్పంలో జీకే నర్సరీ పాఠశాలను నడుపుతున్నాడు. పాఠశాల భవ నం రిజిస్ట్రేషన్, గుర్తింపును ప్రతి ఏటా రెన్యువల్ చేయవలసి ఉంది. ఈ మేరకు తన పాఠశాల భవనం నాణ్యత, గుర్తింపు రెన్యువల్ సర్టిఫికేట్ పొందడానికి కేళంబాక్కం రెవెన్యూ ఇన్స్పెక్టర్ మణివన్నన్(56)కు దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ నిర్ధారణ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఆర్ఐ రూ.2వేలు లంచం కోరాడు. డబ్బులు ఇవ్వక పోవడంతో కన్నన్ను కార్యాలయానికి పలుమార్లు తిప్పించుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో చెన్నైలో ఉన్న అవినీతి నిరోధక విభాగం అధికారులకు కన్నన్ ఫిర్యాదు చేశారు. డీఎస్పీ జీవానందం, ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసన్ మంగళవారం ఉదయం కీళంబాక్కం వచ్చారు. అధికారులు ఇచ్చిన సలహా మేరకు రూ.2 వేలును కన్నన్, ఆర్ఐకి ఇచ్చారు. ఆ నగదును తీసుకుంటున్న సమయంలో అక్కడే మాటు వేసి ఉన్న అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా రెవెన్యూ ఇన్స్పెక్టర్ మణివన్నన్‌ను పట్టుకుని అరెస్టు చేశారు. తర్వాత కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.