లైంగిక వేధింపుల అభియోగంపై ఆర్‌ఐకి చార్జిమెమో | charge memo for RI | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల అభియోగంపై ఆర్‌ఐకి చార్జిమెమో

Published Wed, Aug 31 2016 9:39 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

charge memo for RI

కర్నూలు :  జిల్లా పోలీసు శాఖలోని ఆర్మ్‌డ్‌ రిజర్వు విభాగంలో పనిచేస్తున్న ఆర్‌ఐకి ఎస్పీ ఆకే రవికృష్ణ చార్జిమెమో జారీ చేశారు. ఈ సంఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేస్తున్న స్వీపర్ల నుంచి ఆర్‌ఎస్‌ఐ ద్వారా నెల మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. మామూళ్లతో పాటు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ కొంతమంది మహిళలు డీఐజీ రమణకుమార్‌ను కలిసి విన్నవించుకున్నారు. ఆయన ఆదేశాలతో ఎస్పీ 8 పేజీలతో కూడిన చార్జిమెమోను జారీ చేసి వారంలోగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నట్లు సమాచారం. ఆర్మ్‌డ్‌ రిజర్వు విభాగంలో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు ఉండాల్సి ఉంది. ప్రస్తుతం ముగ్గురు ఉన్నారు. ఈనెల మొదటి వారంలో బాధ్యతలు చేపట్టిన ఆర్‌ఐ రాంబాబు డిప్యూటేషన్‌పై హైదరాబాదు వెళ్లారు. డీఎస్పీ అశోక్‌బాబు ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ విజయవాడకు బదిలీపై వెళ్లారు. దీంతో ఒక ఆర్‌ఐ మహిళా సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఎస్పీ చార్జి మెమో జారీ చేసినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement