పానీ çపూరీ స్టాల్స్
సాక్షి, పెదవేగి రూరల్: రోడ్ల పక్కన విక్రయించే చిరుతిళ్లు చూస్తుంటే నోరూరుతుంది. వాటిని తినాలని మనసు పీకుతుంది. జిహ్వచాపల్యానికి లోనై వాటిని తిన్నామా...అనారోగ్యం పాలుకాక తప్ప దు. దెందులూరు నియోజకవర్గంలో ప్రధాన గ్రామాల్లో వీధి పక్కన విక్రయించే చిరుతిళ్ల వ్యాపారం మూడు ప్లేట్లు ఆరు పార్శిళ్లుగా జోరుగా సాగుతోంది. గతంలో పట్టణాల్లో మాత్రమే కనిపించే ఈ వ్యాపారాలు ఇప్పుడు పల్లెలోనూ బాగా విస్తరించాయి. కంటికి ఇంపుగా...మసాలా గుమగుమలతో కూడిన ఆహారం ఆకట్టుకుంటుంది.
న్యూడిల్స్, మంచూరియా, పానీపూరీ,చాట్‌మసాలాలు అబ్బో అనిపిస్తుంటాయి. వాటిని చూస్తుంటే తినాలనిపిస్తుంటుంది. అయితే వాటి తయారీలో ఎటువంటి నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదు. వాటిని తరచుగా తింటే అనారోగ్యం పాలు కాక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా ఆపరిశుభ్రమైన ఆహరాన్ని తింటే అమీబియాసిస్, మలబద్దకం తదితర సమస్యలు తలెత్తుతాయి. అంతేకాక వీటిని ఎక్కువగా తినేవారు ఊబకాయులుగా, లేకుంటే బక్కచిక్కడమో జరుగుతుందని పోషకాహార నిపుణులుచెబుతున్నారు.
ఆకర్షితులవుతున్న యువత
బజారులోని ఆహార వ్యాపారులు ఎక్కువగా కళాశాలలు, వసతిగృహలు, విద్యాసంస్థలు, జనం ఎక్కువగా సంచరించే జంక్షన్‌లలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలో పుట్‌పాత్‌లపైన, కళాశాలల ఎదురుగా ఉన్న ఈ బళ్లవద్ద 90 శాతం పైగా విద్యార్థులే కనిపిస్తుంటారు.
పరిశుభ్రత నాస్తి
విద్యార్థులు, యువత ఎక్కువగా ఇష్టపడే వీధి వంటకం పానీపూరీ చాట్, నీటితో నింపి ఇచ్చే క్రమంలో బ్యాక్టీరియా, ఫంగస్‌ను మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. పానీపూరీలో చాట్ నింపిన అనంతరం పూరీలను ప్రత్యేకంగా తయారయ్యే నీటితో ఉంచి వినియోగదారునికి అందిస్తుంటారు. ఈ క్రమంలో కనీస పరిశుభ్రత చర్యలు పాటించరు. ఈ క్రమంలో కనీస పరిశుభ్రత చర్యలు పాటించరు.
వ్యాపారం జరిగే నాలుగైదు గంటల సమయం సదా వ్యాపారి చేతులు నీళ్లలో నానుతూనే ఉంటాయి. వేళ్ల సందుల్లో గోళ్ల మధ్య ప్రమాదకర క్యాండీడా ఫంగస్ చేరుతుంది. మురిగిపోయిన చాట్‌ను మరుసటి రోజు వినియోగిస్తుంటారు. చాట్‌లో బ్యాక్టీరియా, వైరస్ పోగు ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని గత ఏడాది హైదరాబాద్ కేంద్రగా జరిగిన ఏక్రాస్ సెక్షనల్ స్టడీ ఆన్ మైక్రోబయాజికల్ క్వాలిటీ ఆఫ్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment