Fast Foods
-
ఆగస్టు 4న రెండు ఐపీఓలు...
ముంబై: భారత్‌లో అతిపెద్ద ఫాస్ట్‌ఫుడ్ ఫ్రాంచైజీ సంస్థ దేవయాని ఇంటర్నేషనల్ ఐపీఓకు సిద్ధమైంది. ఇష్యూ ఆగస్ట్ 4న మొదలై., అదే నెల ఆరవ తేదిన ముగుస్తుంది. ఐపీఓకు ధరల శ్రేణి రూ.86–90గా నిర్ణయించి మొత్తం రూ.1,838 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.440 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. అలాగే ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లు 15 కోట్ల ఈక్విటీలను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మకానికి పెట్టారు. మొత్తం 165 షేర్లను కలిపి ఒక లాట్‌గా నిర్ణయించారు. ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ ఉద్యోగులకు ప్రత్యేకంగా 5.50 లక్షల ఈక్విటీలకు కేటాయించారు. సమీకరించిన నిధులను రుణాలను తీర్చేందుకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తామని కంపెనీ తెలిపింది. ఎక్సారో టైల్స్ ముంబై: గుజరాత్‌కు చెందిన వెర్టిఫైడ్ టెల్స్ తయారీ సంస్థ ఎక్సారో టైల్స్ ఐపీఓ ఆగస్ట్ 4న ప్రారంభం కానుంది. అదే నెల 6వ తేదీన ముగిస్తుంది. ధర శ్రేణి రూ.118–120గా నిర్ణయించారు. ఇష్యూలో భాగంగా కంపెనీ 1,342,4000 తాజా షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్ దీక్షిత్‌కుమార్ పటేల్ 22.38 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మకానికి పెట్టారు. మొత్తం 125 షేర్లను కలిపి ఒక లాట్ నిర్ణయించారు. ఇన్వెస్టర్లు రూ.15వేలు చెల్లించి ఒక లాట్‌ను సొంతం చేసుకోవచ్చు. షేర్లను ఆగస్ట్ 16వ తేదిన ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయాలని కంపెనీ భావిస్తోంది. పంథోమత్ క్యాపిటల్ అడ్వైజర్స్ సంస్థ ఈ ఇష్యూకు లీడింగ్ బుక్ మేనేజర్‌గా వ్యవహరించనుంది. ఎక్సారో టైల్స్ 27 రాష్ట్రాల్లో విస్తరించింది. సుమారు 2000లకు పైగా డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. -
జంక్ ఫుడ్ తింటున్నారా.. బీ కేర్‌ఫుల్
సాక్షి, న్యూఢిల్లీ : బయటి ఆహారం కన్నా ఇంటి ఆహారం ఎంతో మేలని మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఉరుకుల పరుగుల నేటి యాంత్రిక జీవితంలో పెద్దల మాటలను పెడ చెవిన పెట్టి ‘ఫాస్ట్ ఫుడ్స్’ను ఆశ్రయిస్తుంటాం, జంక్ ఫుడ్‌ను తింటుంటాం. వీటిలో ఎన్నో ప్రమాదకరమైన రసాయనాలు కలుస్తాయని, వాటి వల్ల మానవ శరీరంలోని రోగ నిరోధక శక్తి అంతరించడంతోపాటు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక జబ్బులు వస్తాయని, సంతాన సాఫల్య లోపం ఏర్పడుతుందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని ‘సైలెంట్ స్ప్రింగ్ ఇనిస్టిట్యూట్’కు చెందిన శాస్త్రవేత్తలు మనం బయట తినే జంక్ ఫుడ్లపై అధ్యయనం చేశారు. బయట దొరికే ఫుడ్‌లో కల్తీ నూనెలు ఉంటాయని, శుచీ శుభ్రం ఉండదని, అందుకని అవి ప్రమాదకరమని ఇంతకుముందు ఎంతో మంది పరిశోధకులు చెబుతూ వచ్చారు. తాజా అధ్యయనంలో కొత్త విషయాలు తెలిశాయి. ‘పీఎఫ్ఏఎస్’గా వ్యవహరించే మానవ తయారీ రసాయనాలు ఈ ఫాస్ట్ ఫుడ్‌లలో ఉన్నట్లు తేలింది. ప్యాకేజీల ద్వారా ఆహార పదార్థాల్లోకి ఇవి వస్తున్నాయని, అలాగే ఒవెన్‌లో తయారు చేసే పాప్ కార్న్‌లో కూడా ఈ రసాయనాలు దండిగా ఉన్నాయని వారి పరిశోధనల్లో తేలింది. కొన్ని రకాలైన ప్యాకేజీ మెటీరియల్స్‌ను ఈ రసాయనాలను ఉపయోగించి తయారు చేయడమే వల్ల రసాయనాలు ఆహారపదార్థాల్లోకి రావడమే కాకుండా కలుషిత నీటి ద్వారా, పరిసరాల కలుషిత వాతావరణం ద్వారా ఈ రసాయనాలు ఆహార పదార్థాల్లోకి చేరుతున్నాయట. జంక్ ఆహార పదార్థాలు, వాటి ప్యాకింగ్‌లపై అధ్యయనం జరపడంతోపాటు ఇంటి వంటకాలు, బయటి వంటకాలు తింటున్న దాదాపు పదివేల మంది అమెరికన్ల వైద్య రికార్డులు పరిశీలించి రసాయనాల గురించి నిర్ధారణకు వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ కారణంగా ఇంటి వంటకాలే అన్ని విధాల శ్రేయస్కరమని పరిశోధకులు మరోసారి తేల్చారు. ఈ ప్రమాదకరమైన రసాయనాలు ఇంటిలోని ‘నాన్ స్టిక్’ వంట పాత్రల్లో, వాటర్ ప్రూఫ్ ఫాబ్రిక్ కోటింగ్స్‌లో కూడా ఉంటాయని, వంటకాల కోసం వాటిని ఉపయోగించకూడదని కూడా పరిశోధకలు తెలిపారు. ‘పీఎఫ్ఏఎస్’గా వ్యవహరించే ఈ రసాయనాలను 1930 దశకంలో పలు రకాల వస్తువుల తయారీ కోసం శాస్త్రవేత్తలు సృష్టించారు. -
తింటే తంటాయే!
సాక్షి, పెదవేగి రూరల్: రోడ్ల పక్కన విక్రయించే చిరుతిళ్లు చూస్తుంటే నోరూరుతుంది. వాటిని తినాలని మనసు పీకుతుంది. జిహ్వచాపల్యానికి లోనై వాటిని తిన్నామా...అనారోగ్యం పాలుకాక తప్ప దు. దెందులూరు నియోజకవర్గంలో ప్రధాన గ్రామాల్లో వీధి పక్కన విక్రయించే చిరుతిళ్ల వ్యాపారం మూడు ప్లేట్లు ఆరు పార్శిళ్లుగా జోరుగా సాగుతోంది. గతంలో పట్టణాల్లో మాత్రమే కనిపించే ఈ వ్యాపారాలు ఇప్పుడు పల్లెలోనూ బాగా విస్తరించాయి. కంటికి ఇంపుగా...మసాలా గుమగుమలతో కూడిన ఆహారం ఆకట్టుకుంటుంది. న్యూడిల్స్, మంచూరియా, పానీపూరీ,చాట్మసాలాలు అబ్బో అనిపిస్తుంటాయి. వాటిని చూస్తుంటే తినాలనిపిస్తుంటుంది. అయితే వాటి తయారీలో ఎటువంటి నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదు. వాటిని తరచుగా తింటే అనారోగ్యం పాలు కాక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా ఆపరిశుభ్రమైన ఆహరాన్ని తింటే అమీబియాసిస్, మలబద్దకం తదితర సమస్యలు తలెత్తుతాయి. అంతేకాక వీటిని ఎక్కువగా తినేవారు ఊబకాయులుగా, లేకుంటే బక్కచిక్కడమో జరుగుతుందని పోషకాహార నిపుణులుచెబుతున్నారు. ఆకర్షితులవుతున్న యువత బజారులోని ఆహార వ్యాపారులు ఎక్కువగా కళాశాలలు, వసతిగృహలు, విద్యాసంస్థలు, జనం ఎక్కువగా సంచరించే జంక్షన్లలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలో పుట్‌పాత్‌లపైన, కళాశాలల ఎదురుగా ఉన్న ఈ బళ్లవద్ద 90 శాతం పైగా విద్యార్థులే కనిపిస్తుంటారు. పరిశుభ్రత నాస్తి విద్యార్థులు, యువత ఎక్కువగా ఇష్టపడే వీధి వంటకం పానీపూరీ చాట్, నీటితో నింపి ఇచ్చే క్రమంలో బ్యాక్టీరియా, ఫంగస్‌ను మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. పానీపూరీలో చాట్ నింపిన అనంతరం పూరీలను ప్రత్యేకంగా తయారయ్యే నీటితో ఉంచి వినియోగదారునికి అందిస్తుంటారు. ఈ క్రమంలో కనీస పరిశుభ్రత చర్యలు పాటించరు. ఈ క్రమంలో కనీస పరిశుభ్రత చర్యలు పాటించరు. వ్యాపారం జరిగే నాలుగైదు గంటల సమయం సదా వ్యాపారి చేతులు నీళ్లలో నానుతూనే ఉంటాయి. వేళ్ల సందుల్లో గోళ్ల మధ్య ప్రమాదకర క్యాండీడా ఫంగస్ చేరుతుంది. మురిగిపోయిన చాట్‌ను మరుసటి రోజు వినియోగిస్తుంటారు. చాట్‌లో బ్యాక్టీరియా, వైరస్ పోగు ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని గత ఏడాది హైదరాబాద్ కేంద్రగా జరిగిన ఏక్రాస్ సెక్షనల్ స్టడీ ఆన్ మైక్రోబయాజికల్ క్వాలిటీ ఆఫ్ స్పష్టం చేసింది. -
ఫాస్ట్‌ఫుడ్ కోసం కంగారూల దాడులు..
పెర్త్, ఆస్ట్రేలియా : అటవీ కంగారూల గుంపు యాత్రికులపై దాడులకు పాల్పడుతున్నాయి. అయితే, కంగారూలు దాడికి పాల్పడటానికి కారణం తెలిస్తే మాత్రం షాక్‌కు గురి కావాల్సిందే. క్యారెట్లు, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ ఫాస్‌ఫుడ్స్‌కు అలవాటు పడిన కంగారూలు వాటి కోసమే దాడులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. యాత్రికులు తమ వెంట తెచ్చుకున్న ఆహారాన్ని కంగారూలకు పెడుతూ సెల్ఫీలు దిగటం మోర్రి సెట్ పార్కులో మామూలే. అయితే, కంగారూలకు ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం ఒక వ్యసనంగా మారింది. పర్యాటకులు ఎక్కువగా రాని సమయాల్లో ఆహారం కోసం అవి దాడులకు పాల్పడుతున్నాయి. ఈ దాడుల్లో తీవ్రగా గాయపడిన ఓ మహిళకు 17 కుట్లు పడ్డాయి. ఫాస్ట్‌పుడ్స్‌ను తీసుకోవడం వల్ల కంగారూల ఆరోగ్యం వేగంగా దెబ్బతింటుంది. వాటి జీర్ణవ్యవస్థకు సరిపడని ఆహారం కావడమే ఇందుకు కారణం. క్యారెట్లను కంగారూలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి అధిక కోపాన్ని ప్రదర్శిస్తాయని నిపుణులు తెలిపారు. -
కొత్తకొత్తగా
ఓన్లీ 5 మినిట్స్! ఫాస్ట్ ఫుడ్స్‌ని మర్చిపోయి, హాయిగా హామిల్టన్ బీచ్ డ్యూయల్ బ్రేక్‌ఫాస్ట్ శాండ్విచ్ మేకర్ని ఉపయోగించి డెలిషియస్ శాండ్విచ్లు ఐదు నిమిషాలలో తయారుచేసుకోవచ్చు. ఈ మెషిన్ పనిచేసే విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇందులో తయారైన శాండ్విచ్ కావలసిన విధంగా వస్తుంది. చీజ్ కూడా చక్కగా కరిగిపోతుంది. కోడి గుడ్డును పెట్టి ఐదు నిమిషాలు టైమ్ సెట్ చేస్తే, గుడ్డు రుచికరంగా, ఎక్కువతక్కువలు కాకుండా చక్కగా ఉడుకుతుంది. మీరు గుడ్డు కోసం ఏ మెస్కీ వెళ్లక్కర్లేదు. ఇంటి దగ్గరే పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. త్వరగా తయారు కావడమే కాకుండా, త్వరగానే చల్లారుతుంది. ఉపయోగించిన తరువాత ఈ మెషీన్‌ను అతి సులువుగా శుభ్రం చేసుకోవచ్చు. ఒకేసారి రెండు శాండ్విచ్లు తయారుచేసుకోవచ్చు. ధర: 33.14 డాలర్లు (రూ.2300) మీ అభిరుచి మేరకు... మీరు కాఫీ ప్రియులా. అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. నింజా కంపెనీ కొత్త కాఫీ మేకర్ని లాంచ్ చేసింది. మీ రుచికి, అభిరుచికి అనుగుణంగా ఇది రూపొందింది. ఇందులో కస్టమ్, సిగ్నేచర్ అని రెండు రకాల కాఫీ మేకర్‌ను అమర్చారు. రుచిగా, మృదువుగా, కావలసిన ఫ్లేవర్‌లో తయారుచేసుకోవచ్చు. కోల్డ్ కాఫీ, హాట్ కాఫీ... రెండూ తయారుచేసుకోవచ్చు. ఇందులోనే ఫిల్టర్ శాశ్వతంగా అమర్చి ఉంది. ఒకేసారి పది కప్పుల కాఫీ తయారుచేసుకోవచ్చు. మనం ఏ మోతాదులో తాగాలనుకుంటున్నామో సెలక్ట్ చేసుకోవచ్చు. కప్, ఎక్సెల్కప్, ట్రావెల్, ఎక్సెల్ మల్టీమీడియా... ఇలా మన అభిరుచి మేరకు సెలక్షన్ కూడా ఉంటుంది. ధర: 179.80 డాలర్లు (రూ.12,300) పవర్ఫుల్ పదును! కూరలు తరుక్కోవడానికి, మాంసాహారాన్ని సమానంగా ముక్కలు చేయడానికి, ఫ్రెంచ్ టోస్ట్ చేయడానికి అనువుగా బ్రెడ్ కట్ చేయడానికి ఈ ఎలక్ట్రిక్ నైఫ్‌లు బాగా ఉపయోగపడతాయి. ఇందులో రెండు పెద్ద బ్లేడ్లు ఉండటం వల్ల మనం ఏది కట్ చేయాలన్నా సులువుగా చేసుకోవచ్చు. ఈ బ్లేడ్లు స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారయ్యాయి. పదునుగా ఉంటాయి. పట్టుకోవడానికి అనుగుణంగా హ్యాండిల్ రూపొందింది. కుడి చేతి వాటమైనా ఎడమచేతి వాటమైనా ఇబ్బంది లేని విధంగా ఇవి రూపొందాయి. ఉపయోగించాక లాక్ చేసుకునే విధానం కూడా ఉంది. వాడిన తర్వాత టేబుల్లో పెట్టేయడానికి అనువుగా రూపొందించారు. కత్తిని ఉపయోగించని సమయంలో బటన్ నొక్కితే చాలు లాక్ అయిపోతుంది. కావాలనుకున్నప్పుడు మళ్లీ బటన్ నొక్కితే, తెరుచుకుంటుంది. వాడిన వెంటనే శుభ్రంగా కడిగి, ఆరబెట్టేసిన తర్వాతే లాక్ వేయాలి. మనం సాధారణంగా వాడే కత్తి కంటె ఇది రెండు రెట్లు అధిక పదును కలిగి ఉంది. ధర: 37.59 డాలర్లు (రూ.2600)