కొత్తకొత్తగా | Hamilton Beach Dual Breakfast sandwich maker | Sakshi
Sakshi News home page

కొత్తకొత్తగా

Published Sat, Jan 28 2017 11:09 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

Hamilton Beach Dual Breakfast sandwich maker

ఓన్లీ 5 మినిట్స్‌!
ఫాస్ట్‌ ఫుడ్స్‌ని మర్చిపోయి, హాయిగా హామిల్టన్‌ బీచ్‌ డ్యూయల్‌ బ్రేక్‌ఫాస్ట్‌ శాండ్‌విచ్‌ మేకర్‌ని ఉపయోగించి డెలిషియస్‌ శాండ్‌విచ్‌లు ఐదు నిమిషాలలో తయారుచేసుకోవచ్చు. ఈ మెషిన్‌ పనిచేసే విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇందులో తయారైన శాండ్‌విచ్‌ కావలసిన విధంగా వస్తుంది. చీజ్‌ కూడా చక్కగా కరిగిపోతుంది. కోడి గుడ్డును పెట్టి ఐదు నిమిషాలు టైమ్‌ సెట్‌ చేస్తే, గుడ్డు రుచికరంగా, ఎక్కువతక్కువలు కాకుండా చక్కగా ఉడుకుతుంది. మీరు గుడ్డు కోసం ఏ మెస్‌కీ వెళ్లక్కర్లేదు. ఇంటి దగ్గరే పర్‌ఫెక్ట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ తయారు చేసుకోవచ్చు. త్వరగా తయారు కావడమే కాకుండా, త్వరగానే చల్లారుతుంది. ఉపయోగించిన తరువాత ఈ మెషీన్‌ను అతి సులువుగా శుభ్రం చేసుకోవచ్చు. ఒకేసారి రెండు శాండ్‌విచ్‌లు తయారుచేసుకోవచ్చు.
ధర: 33.14 డాలర్లు (రూ.2300)

మీ అభిరుచి మేరకు...
మీరు కాఫీ ప్రియులా. అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. నింజా కంపెనీ కొత్త కాఫీ మేకర్‌ని లాంచ్‌ చేసింది. మీ రుచికి, అభిరుచికి అనుగుణంగా ఇది రూపొందింది. ఇందులో కస్టమ్, సిగ్నేచర్‌ అని రెండు రకాల కాఫీ మేకర్‌ను అమర్చారు. రుచిగా, మృదువుగా, కావలసిన ఫ్లేవర్‌లో తయారుచేసుకోవచ్చు. కోల్డ్‌ కాఫీ, హాట్‌ కాఫీ... రెండూ తయారుచేసుకోవచ్చు. ఇందులోనే ఫిల్టర్‌ శాశ్వతంగా అమర్చి ఉంది. ఒకేసారి పది కప్పుల కాఫీ తయారుచేసుకోవచ్చు. మనం ఏ మోతాదులో తాగాలనుకుంటున్నామో సెలక్ట్‌ చేసుకోవచ్చు. కప్, ఎక్సెల్‌కప్, ట్రావెల్, ఎక్సెల్‌ మల్టీమీడియా... ఇలా మన అభిరుచి మేరకు సెలక్షన్‌ కూడా ఉంటుంది. 
ధర: 179.80 డాలర్లు (రూ.12,300)

పవర్‌ఫుల్‌ పదును!
కూరలు తరుక్కోవడానికి, మాంసాహారాన్ని సమానంగా ముక్కలు చేయడానికి, ఫ్రెంచ్‌ టోస్ట్‌ చేయడానికి అనువుగా బ్రెడ్‌ కట్‌ చేయడానికి ఈ ఎలక్ట్రిక్‌ నైఫ్‌లు బాగా ఉపయోగపడతాయి. ఇందులో రెండు పెద్ద బ్లేడ్లు ఉండటం వల్ల మనం ఏది కట్‌ చేయాలన్నా సులువుగా చేసుకోవచ్చు. ఈ బ్లేడ్లు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారయ్యాయి. పదునుగా ఉంటాయి. పట్టుకోవడానికి అనుగుణంగా హ్యాండిల్‌ రూపొందింది. కుడి చేతి వాటమైనా ఎడమచేతి వాటమైనా ఇబ్బంది లేని విధంగా ఇవి రూపొందాయి. ఉపయోగించాక లాక్‌ చేసుకునే విధానం కూడా ఉంది. వాడిన తర్వాత టేబుల్‌లో పెట్టేయడానికి అనువుగా రూపొందించారు. కత్తిని ఉపయోగించని సమయంలో బటన్‌ నొక్కితే చాలు లాక్‌ అయిపోతుంది. కావాలనుకున్నప్పుడు మళ్లీ బటన్‌ నొక్కితే, తెరుచుకుంటుంది. వాడిన వెంటనే శుభ్రంగా కడిగి, ఆరబెట్టేసిన తర్వాతే లాక్‌ వేయాలి. మనం సాధారణంగా వాడే కత్తి కంటె ఇది రెండు రెట్లు అధిక పదును కలిగి ఉంది. ధర: 37.59 డాలర్లు (రూ.2600)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement