
సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు చేరుకుంటోంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రాజెక్టును ఎట్టి పరిస్ధితుల్లోనూ పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణ సంస్ధ మేఘా ఇంజనీరింగ్ చకచగా పనులు పూర్తిచేస్తోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 42.5 మీటర్ల ఎత్తులో కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని ఇంజనీరింగ్ అధికారులు పూర్తి చేశారు. ఈ ఏడాది స్పిల్‌వే నుంచి 14 గేట్ల ద్వారా నీటి తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్పిల్ వే చానల్ పనులు పూర్తయ్యాయి.
పోలవరం వరద నీరు మళ్లింపు మొదలు
సహజసిద్ధంగా వెళుతున్న గోదావరి నదిని అధికారులు మూసివేయడంతో వరద నీరు దిశ మారనుంది. గోదావరి నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుంచి కుడివైపుకు అధికారులు మళ్లిస్తున్నారు. పోలవరం స్పిల్‌వే నుంచి ఈ వర్షాకాలంలో వరద నీరు మళ్లించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యేడాది 14 గేట్ల ద్వారా ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి గోదావరి నదీ ప్రవాహాన్ని తరలించనున్నారు. స్పిల్‌వే ద్వారా నీటి తరలింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment