
సాక్షి, వైఎస్సార్: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఒక మ్యానిపులేటర్ అని, వ్యవస్థల్ని మేనేజ్ చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తానని చెప్పడమే గానీ.. మళ్లీ అధికారంలోకి వస్తే ఆయన ఆస్తులను, కొడుకును పునర్ నిర్మిస్తాడు తప్ప ప్రజలకు ఏమీ ఒరగదని అంబటి ఎద్దేవా చేశారు. పైగా మరోసారి అధికారం కట్టబెడితే.. పోలవరాన్ని చేసినట్లే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని మండిపడ్డారు.
పోలవరం విషయంలో జరిగిన తప్పిదాలన్నిటికీ గత ప్రభుత్వం భాధ్యత వహించాలి.. టీడీపీ తప్పిదాల వల్లే పోలవరం నిర్మాణంలో సమస్యలు వచ్చాయని స్పష్టం చేశారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో అనేక తప్పిదాలు జరిగిందని పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రాజెక్ట్ నిర్మాణం పనులు ఆలస్యం కాగా ప్రస్తుతం దాని అంచనా వ్యయం కూడా పెరిగిందని తెలిపారు. ఇక.. పవన్ కల్యాణ్ చంద్రబాబు కోసం పుట్టాడు, పనిచేస్తున్నాడు, పనిచేస్తాడు కూడా.. ఆయనను దేవుడే రక్షించాలన్నారు మంత్రి అంబటి.
Comments
Please login to add a commentAdd a comment