సాక్షి, గుంటూరు: గతంలో చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయ్యిందని ఏపీ మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం చంద్రబాబు తాజాగా పొలవరంలో పర్యటించడం.. ప్రెస్‌మీట్ నిర్వహించి గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో అంబటి స్పందించారు.
తాడేపల్లిలో అంబటి మీడియాతో మాట్లాడుతూ.. 2018లోపే పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. పోలవరానికి జగన్ ద్రోహం చేశారని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. వైఎస్ జగన్‌పై బురద చల్లాలని ప్రభుత్వం ప్రయతిస్తోంది. కానీ, చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి.
వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి. మా పాలనలో పోలవరం పనుల్లో ఎలాంటి తప్పిదాలు జరగలేదు. చంద్రబాబు ఇప్పటికైనా తాను చేసిన తప్పుల్ని గుర్తించాలి అని అంబటి హితవు పలికారు.
‘‘చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం. పోలవరాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు డబ్బులు సంపాదించాలని చూశారు. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పిదాలను గుర్తించాలి’’ అని అంబటి రాంబాబు అన్నార
‘‘ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. జగన్ హయాంలో ఎలాంటి తప్పులు జరగలేదు. త్వరగా నిర్మాణం చేశాం. ప్రపంచంలోనే అరుదైన ప్రాజెక్ట్ పోలవరం. ఇందులో డయాఫ్రం వాల్ నిర్మాణం కీలకమైనది. కాపర్ డ్యామ్‌లు పూర్తయ్యాకే డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాలి. కానీ అందుకు భిన్నంగా చేయడం వల్లే ప్రాజెక్టుకు నష్టం జరిగింది. ఐదేళ్లలో పోలవరం పూర్తి చేయలేమని చంద్రబాబు చేతులెత్తేశారు. జగన్ హయాంలోనే కాపర్ డ్యామ్‌లు, స్పిల్ వే నిర్మాణం చేశాం. చంద్రబాబుకు ప్రజలు చాలా గొప్ప అవకాశం ఇచ్చారు. గతంలో ప్రత్యేక హోదా అని ధర్మ పోరాటాలు చేసిన చంద్రబాబుకు ఇప్పుడు మంచి అవకాశం దక్కింది. అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రత్యేక హోదా తీసుకురావాలి. లేకపోతే రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసినట్టే’’ అని అంబటి పేర్కొన్నారు.
‘‘రాజధాని, పోలవరం పూర్తిచేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈవీఎంలపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరగాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment