సమావేశంలో మాట్లాడుతున్న రాబర్ట్
జిల్లాకు కొత్తగా 596 అంగన్‌వాడీ భవనాలు మంజూరైనట్లు ఐసీడీఎస్ పీడీ ఏఈ రాబర్ట్స్ తెలిపారు. కష్ణమ్మ పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రామతీర్థం గ్రామాన్ని శనివారం సందర్శించారు.
ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స్
రామతీర్థం (నెల్లిమర్ల రూరల్) : జిల్లాకు కొత్తగా 596 అంగన్‌వాడీ భవనాలు మంజూరైనట్లు ఐసీడీఎస్ పీడీ ఏఈ రాబర్ట్స్ తెలిపారు. కష్ణమ్మ పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రామతీర్థం గ్రామాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల కల్పనకు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిందని చెప్పారు. ఒక్కో భవనానికి ఏడున్నర లక్షల రూపాయలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. న్యూట్రిషన్ మిషన్ ద్వారా చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా శిశుమరణాలను తగ్గించడానికి అంగన్‌వాడీల ద్వారా మహిళలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. తల్లిపాలు ఆరోగ్యకరమని తెలియజెప్పడానికి ఇప్పటికే జిల్లాలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించామని తెలిపారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాల్లో అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.రాజ్‌కుమార్, టీడీపీ నాయకులు సువ్వాడ రవిశేఖర్, గేదెల రాజారావు, కోటపాటి తిరుపతిరావులు పాల్గొన్నారు.