మాతాశిశు మరణాలు తగ్గించడానికి కృషి చేయాలని జేసీ–2 ఖాజామొహిద్దీన్ సూచించారు.
అనంతపురం టౌన్ : మాతాశిశు మరణాలు తగ్గించడానికి కృషి చేయాలని జేసీ–2 ఖాజామొహిద్దీన్ సూచించారు. మంగళవారం నగర శివారులోని మహిళా ప్రాంగణంలో ఐసీడీఎస్ 17 ప్రాజెక్టులకు సంబంధించిన జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన సేవలు అందించాలన్నారు.
అనంతరం వరల్డ్ బ్యాంక్ రాష్ట్ర కో ఆర్డినేటర్ కృష్ణ వివిధ పథకాలను వివరించారు. రాష్ట్ర రిసోర్స్ గ్రూప్ సభ్యులు శ్రీదేవి, నాగమల్లీశ్వరి, పద్మావతి, విజయకుమారి, నాగమణి, సుధాకర్, ఐసీడీఎస్ ఏపీడీ ఉషాఫణికర్, పీఓడీటీటీ సుజాత, డీపీహెచ్‌ఎన్‌ఓ రాణి, ప్రాంగణం మేనేజర్ నాగమణి పాల్గొన్నారు.