మూడోసారీ ఆడపిల్లే పుట్టిందని ఆ తల్లిదండ్రులు ఆమెను వదిలించుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం కొర్ర తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన నెహ్రూ, పద్మ దంపతులకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలున్నారు. మూడో కాన్పులో నెల క్రితం ఆడపిల్ల పుట్టింది. పేద కుటుంబమైనందున పోషించే స్తోమత లేక ఆ దంపతులు మూడో కుమార్తెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు గురువారం ఆ శిశువును జిల్లా కేంద్రంలోని శిశువిహార్ తరలించారు.
ఆడపిల్ల భారం అనుకున్నారు..
Published Thu, Jun 16 2016 4:44 PM | Last Updated on Tue, Nov 6 2018 4:13 PM
Advertisement
Advertisement