'టీడీపీ హయాంలోనే ఇలా..' | anganwadies fires on tdp government | Sakshi
Sakshi News home page

'టీడీపీ హయాంలోనే ఇలా..'

Published Mon, Sep 21 2015 9:39 PM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

anganwadies fires on tdp government

పెనమలూరు (కృష్ణా): స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేసిన ప్రజాప్రతినిధుల కమిటీ సోమవారం నాడు పలు అంగన్‌వాడీ సెంటర్లను తనిఖీ చేసింది. కృష్ణా జిల్లా పెనమలూరు, చోడవరంలో ఈ కమిటీ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మీసాల గీత, అంగన్‌వాడీ సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆమె మీడియాకు తెలిపారు. కమిటీలోని మరో సభ్యురాలు తాతినేని పద్మావతి మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే అంగన్‌వాడీ సెంటర్ల పనితీరు సరిగా లేదని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement