బాల్య వివాహానికి అధికారుల అడ్డుకట్ట | Authorities to prevent child marriage | Sakshi
Sakshi News home page

బాల్య వివాహానికి అధికారుల అడ్డుకట్ట

Published Sun, Mar 20 2016 4:42 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

Authorities to prevent child marriage

రామన్నపాలెం(కొడవలూరు): బాల్య వివాహానికి అధికారులు అడ్డుకట్ట వేసిన సంఘటన శనివారం జరిగింది. మండలంలోని రామన్నపాలెం దళితవాడకు చెందిన పన్నెండేళ్ల బాలికకు అదే ప్రాంతానికి చెందిన పదిహేనేళ్ల బాలుడితో ఈ నెల 24న వివాహం చేసేందుకు ఇరువురి తల్లిదండ్రులు నిశ్చయించారు. ఈ వివాహ సమాచారం ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎ.రాజేశ్వరికి తెలియడంతో ఆమె బాలిక తల్లిదండ్రులను శనివారం కలిశారు.

బాల్య వివాహాల వల్ల సంభవించే అనర్థాలతోపాటు తలెత్తే ఆర్థిక సమస్యలను తెలియజేశారు. అంతేకాకుండా చట్టరీత్యా కూడా నేరమైనందున బాల్యవివాహం చేయరాదని వారికి సూచించారు. సానుకూలంగా స్పందించిన బాలిక తల్లిదండ్రులు వివాహాన్ని నిలిపివేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులే ఎంపీడీఓ వసుంధరకు ఫోన్ చేసి బాల్యవివాహాన్ని నిలిపి  వేసినట్లు తెలిపారు. దీంతో మరో ఐదు రోజుల్లో జరగబోయిన బాల్యవివాహానికి అడ్డుకట్ట పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement