‘చంద్రన్న’పుచ్చిన కందిపప్పు | ICDS Anganwadi centers under the project | Sakshi
Sakshi News home page

‘చంద్రన్న’పుచ్చిన కందిపప్పు

Published Wed, Jul 20 2016 2:09 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

‘చంద్రన్న’పుచ్చిన కందిపప్పు - Sakshi

‘చంద్రన్న’పుచ్చిన కందిపప్పు

పురుగుల కందిపప్పుతోనే వంటలు
అంగన్‌వాడీ సిబ్బందిపై  తల్లిదండ్రుల ఆగ్రహం
చోద్యం చూస్తున్న అధికారులు

 
చిన్నగొట్టిగల్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు జూన్ కోటా     కింద  జనవరిలో చంద్రన్న సంక్రాంతి కానుకలో మిగిలిన, పురుగులు పట్టిన కంది పప్పును పంపిణీ చేయడంపై పెద్ద దుమారం రేగింది. ఈ పప్పుతోనే వంటలు     వండుతుండడంతో తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోక పోవడంతో దీన్నే వినియోగిస్తున్నామని అంగన్‌వాడీ కార్యకర్తలు చేతులెత్తేస్తున్నారు.
 
రొంపిచెర్ల:  రొంపిచెర్ల సివిల్ సప్లయిస్ గోడౌన్ నుంచి  చిన్నగొట్టిగల్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు జూన్‌నెల కోటా కింద నాసిరకం కందిపప్పును పంపిణీ చేశారు.  జనవరిలో చంద్రన్న సంక్రాంతి కానుకలో మిగిలి, పురుగులు పట్టిన కంది పప్పును సివిల్ సప్లయియ్స్ గోడౌన్ నుంచి చౌక డిపోలకు సరఫరా చేయగా, వారు అంగన్ వాడీ కేంద్రాలకు పంపిణీ  చేశారు. రొంపిచెర్ల వుండలంలోని 37 అంగన్‌వాడీ కేంద్రాలు, ఎర్రావారిపాళ్యెం మండలంలోని 37 కేంద్రాలు, చిన్నగొట్టిగల్లు మండలంలోని 29 కేంద్రాలకు బియ్యుం, కంది పప్పు, వంట నూ నెను 88 చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అదే పప్పును అవుృతహస్తం పథకం కింద గర్భిణులు, బాలింతల  వుధ్యాహ్న భోజనం కూరలకు వాడుతున్నారు.

కొన్ని చోట్ల పురుగులు పడి చెడి పోరుున కంది పప్పుపై అంగన్‌వాడీ కార్యకర్తలను పిల్లల తల్లిదండ్రులు నిలదీశారు. దీనిపై అంగన్‌వాడీ కార్యకర్తలు పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు పట్టించుకోక పోవడంతో అదే కంది పప్పును వాడాల్సి వస్తోందని కార్యకర్తలు చెబుతున్నారు.  
 
చంద్రన్న కానుక కంది పప్పు ఇచ్చాం..
అంగన్‌వాడీ కేంద్రాలకు ఐదు క్వింటాళ్ల చంద్రన్న సంక్రాంతి కంది పప్పును ఇచ్చిన వూట వాస్తవమే. చంద్రన్న సంక్రాంతి కానుకలో మిగిలి పోరుున కంది పప్పును జిల్లా అధికారులు రొంపిచెర్ల సవిల్ సప్లయిస్ గోడౌన్‌కు పంపారు. అదే పప్పను  అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేశాం.  పప్పు బాగా లేకపోతే దానిని వాపసు చేయువచ్చు. దాని స్థానంలో వుంచి కంది పప్పును ఇస్తాం. 2600 నెరుు్య ప్యాకెట్లు చెడి పోరుున వూట వాస్తవమే. అప్పుటి డీటీ నిర్లక్ష్యమే కారణం. ఇప్పుడు మేము ఏమీ చేయులేం. - సివిల్ సప్లయిస్ అధికారి నాగరాజ
 
కంపుకొడుతున్న చంద్రన్న కానుక నెరుు్య

గత ఏడాది జూలైలో రంజాన్ చంద్రన్న కానుకగా పంపిణీ చే సిన నెరుు్య రొంపిచెర్ల  సివిల్ సప్లయిస్ గోడౌన్‌లో కంపు కొడుతుంది. అప్పట్లో 2600 ప్యాకెట్ల నెయ్యి మిగిలిపోయింది. ఈ నెరుు్య ప్యాకెట్లను అప్పుడే వాపసు చేయాల్సి ఉండగా, అప్పటి డీటీ శ్రీకాంత్ పట్టించుకోలేదు. దీంతో సువూరు రూ.95 వేల విలువ చేసే నెరుు్య ప్యాకెట్లు గోడౌన్‌లో కంపు కొడుతున్నారుు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement