toor
-
అయోధ్యలో రాహుల్
26 ఏళ్ల తర్వాత నెహ్రూ-గాంధీ కుటుంబ వ్యక్తి పర్యటన అయోధ్య: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం అయోధ్యలో పర్యటించారు. 1992 నాటి బాబ్రీ మసీదు ఘటన తర్వాత నెహ్రూ-గాంధీ కుటుంబంలో ఒక వ్యక్తి ఇక్కడ పర్యటించడం ఇదే ప్రథమం. అయితే ఆయన వివాదాస్పద రామజన్మభూమి, బాబ్రీ మసీదు స్థలానికి మాత్రం వెళ్లలేదు. ఆ ప్రాంతానికి కిలో మీటరు దూరంలో ఉన్న హనుమాన్‌గడీ ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు వీహెచ్‌పీకి వ్యతిరేకిగా పేరున్న మహంత్ జ్ఞాన్ దాస్‌తో చర్చలు జరిపారు. భేటీ తర్వాత జ్ఞాన్ దాస్ మాట్లాడుతూ..తన ఆశీస్సుల కోసం రాహుల్ వచ్చారని చెప్పారు. రామజన్మభూమి విషయంలో సుప్రీం కోర్టు చెప్పిన దానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని రాహుల్ చెప్పినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌పై ఉన్న హిందూ వ్యతిరేకి అన్న విమర్శను తుడిచిపెట్టడానికే రాహుల్ అయోధ్యలో పర్యటించారని విమర్శకుల అంచనా. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచనలో భాగంగా రాహుల్ హనుమాన్ గుడిని సందర్శించారని తెలుస్తోంది. ఇక తన రోడ్ షో ప్రారంభానికి ముందు కిచాయుచా షరీఫ్ దర్గాకు రాహుల్ వెళ్లారు. ఇది బ్రాహ్మణ, ముస్లిం, ఓబీసీ ఓట్లను దృష్టిలో పెట్టుకుని కిశోర్ రూపొం దించిన వ్యూహమని భావిస్తున్నారు. -
సీఎం కోసం ట్యాంకర్ల తరలింపు
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు.. సీఎం పర్యటన కాస్తా ట్యాంకర్ల యాజమాన్యాలకు తలనొప్పిగా మారింది. శుక్రవారం సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలోని నలుమూలల ట్యాంకర్లను హడావుడిగా ఆలూరుకి తరలించారు. కనీసం సంబంధిత యజమానులకు సమాచారం ఇవ్వకుండానే తరలించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరలించిన ట్యాంకర్ల ద్వారా నీటిని రెయిన్గన్లతో పంటలు తడిపి కాపాడుతున్నామనే కలరింగ్ ఇచ్చేందుకు జిల్లా ఉన్నతాధికారులు హడావుడి చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు ట్యాంకర్ల డ్రై వర్లకు తిండీ తిప్పలకు ఏర్పాట్లు కూడా చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ట్యాంకర్ల తరలింపు వ్యవహారం కాస్తా జిల్లా కలెక్టర్‌కు, ఆదోని ఆర్డీఓకు మధ్య వాగ్వివాదానికి కారణమయిందని తెలుస్తోంది. ఇక ట్యాంకర్లు లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో అపార్ల్మెంట్లలో నివాసం ఉంటున్న ప్రజలు నీటి సమస్యతో అల్లాడిపోతున్నారు. -
...ఇట్లు గారెలు
రోజూ మబ్బుపడుతోంది సాయంత్రానికి నాలుగు చినుకులు పడనే పడతాయి పిల్లలు ఇంటికొచ్చేటప్పటికి ఏం చేస్తే బావుంటుంది? నానపోయండి... రుబ్బండి... నూనెలో వేయండి! మేము రెడీ!! మినపగారె కావలసినవి మినప్పప్పు - రెండు కప్పులు ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు పచ్చిమిర్చి- రెండు (తరగాలి) అల్లం- అంగుళం ముక్క (సన్నగా తరగాలి) ఉప్పు - తగినంత నూనె - వేయించడానికి సరిపడినంత తయారీ: మినప్పప్పును కడిగి కనీసం నాలుగు గంటల సేపు నానబెట్టాలి. నీటిని మితంగా వేస్తూ రుబ్బాలి. ఇందులో ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం కలపాలి. బాణలిలో నూనె కాగిన తర్వాత పై మిశ్రమాన్ని గారెల్లా చేసి నూనెలో వేయాలి. రెండు వైపులా దోరగా కాలిన తర్వాత తీసి వేడిగా వడ్డించాలి. గమనిక: గారెకు మధ్యలో చిల్లు పెడితే పిండి మొత్తం సమంగా కాలుతుంది. చిల్లు లేకపోతే కొన్నిసార్లు మధ్యలో పిండి పచ్చిగా ఉంటుంది. సగ్గుబియ్యం గారెలు కావలసినవి సగ్గుబియ్యం- ఒకటిన్నర కప్పు ఉడికించిన బంగాళదుంపలు- మూడు (తొక్క తీసి చిదమాలి) వేయించిన వేరుశనగపప్పు - ఒక కప్పు (పలుకుగా పొడి చేసుకోవాలి) పచ్చిమిర్చి- మూడు (సన్నగా తరగాలి) కొత్తిమీర తరుగు- రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్ ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి సరిపడినంత తయారీ: సగ్గుబియ్యాన్ని రెండు గంటల సేపు నానబెట్టి నీటిని వడపోయాలి. సగ్గుబియ్యం, ఉడికించి చిదిమిన బంగాళదుంప, వేరుశనగపప్పు పొడి, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు కలపాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత పై మిశ్రమాన్ని గారెల్లా వత్తి నూనెలో రెండు వైపులా కాల్చాలి. క్యాబేజ్ గారెలు కావలసినవి: పచ్చి శనగపప్పు- అర కప్పు మినప్పప్పు - అర కప్పు క్యాబేజ్ తరుగు - రెండు కప్పులు పచ్చిమిర్చి- రెండు (తరగాలి) అల్లం - అంగుళం ముక్క (సన్నగా తరగాలి) కొత్తిమీర తరుగు - అర కప్పు కరివేపాకు - రెండు రెమ్మలు సోంఫు, జీలకర్ర - ఒక్కోటి అర టీ స్పూన్ మిరియాలు - అర టీ స్పూన్ ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత వెల్లుల్లి - రెండు రేకలు (తరగాలి) నూనె - వేయించడానికి సరిపడినంత తయారీ: మినప్పప్పు, శనగపప్పును కడిగి రాత్రంతా నానబెట్టాలి లేదా కనీసం ఐదు గంటల సేపు నాననివ్వాలి. నీటిని వంపేసి పప్పులలో మిరియాలు, సోంఫు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి తక్కువ నీటిని వేస్తూ గట్టిగా రుబ్బాలి. ఈ మిశ్రమంలో క్యాబేజ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి వేసి బాగా కలపాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత పై మిశ్రమాన్ని గారెల్లా వత్తి నూనెలో వేయాలి. రెండు వైపులా దోరగా కాలిన తర్వాత తీసి వేడిగా వడ్డించాలి. మొక్కజొన్న గారెలు కావలసినవి: మొక్కజొన్న గింజలు- 150 గ్రా (పచ్చివి) పచ్చి శనగ పప్పు - 50 గ్రా (గంట సేపు నానబెట్టాలి) పచ్చిమిర్చి తరుగు - టీస్పూన్, ఉల్లిపాయ ముక్కలు-కప్పు అల్లం - అంగుళం ముక్క (సన్నగా తరగాలి) జీలకర్ర - అర టీ స్పూన్; ఉప్పు- తగినంత కొత్తిమీర తరుగు - ఒక టేబుల్ స్పూన్ నూనె - వేయించడానికి సరిపడినంత తయారీ: మొక్కజొన్న గింజలు, శనగపప్పు కలిపి కాస్త పలుకుగా రుబ్బాలి. పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి పై మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని అరచేతిలో ఉంచి గారెల ఆకారంలో వత్తి నూనెలో వేయాలి. రెండు వైపులా దోరగా కాలిన తర్వాత తీసి వేడిగా వడ్డించాలి. దీనికి కొబ్బరి కారం లేదా చికెన్ కర్రీ చక్కటి కాంబినేషన్. గమనిక: పిండిలో నీరు ఎక్కువై మరీ జారుడుగా ఉంటే కార్న్‌ఫ్లోర్ కలుపుకోవాలి. -
వైరా రిజర్వాయర్‌ను సందర్శించిన జిల్లా జడ్జి
వైరా : వైరా రిజర్వాయర్‌ను కుటుంబ సమేతంగా జిల్లా ప్రధాన జడ్జి విజయ్‌మోహన్ సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్‌లో స్పీడ్ బోట్ ద్వారా బోటింగ్ చేసి రిజర్వాయర్ పరిసరాలను పరిశీలించి.. సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన వెంట సీఐ చేరాలు, కొణిజర్ల ఎస్సై కృష్ణ ఉన్నారు. -
సానుభూతిపరులకు టూర్..
కాళేశ్వరం : మావోయిస్టు పార్టీ సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అటవీగ్రామాలకు చెందిన సుమారు రెండు వందల మంది మావోయిస్టు సానుభూతిపరులకు ఈ వారం రోజులపాటు విహారయాత్ర ఏర్పాటు చేశారు. ఈనెల 28నుంచి ఆగస్టు 3వరకు మావోయిస్టు పార్టీ సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా డీఎస్పీ శివాజీపవార్ నేతృత్వంలో ఎస్సైలు కదం, బీల్‌దార్ సిరొంచ తాలుకాలోని 120 అటవీ గ్రామాలకు చెందిన రెండు వందల మంది మావోయిస్టు సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తిరిగి మావోయిస్టు పార్టీవైపు ఆకర్షితులు కాకుండా విహారయాత్ర ఏర్పాటు చేశారు. సానుభూతిపనులను శుక్రవారం కాళేశ్వరం దర్శనానికి తీసుకొచ్చారు. వారోత్సవాలు ముగిసేంత వరకు వీరిని వివిధ ప్రాంతాల్లో తిప్పుతామని ఎస్సైలు కదం, బీల్‌దార్ తెలిపారు. -
‘చంద్రన్న’పుచ్చిన కందిపప్పు
పురుగుల కందిపప్పుతోనే వంటలు అంగన్వాడీ సిబ్బందిపై తల్లిదండ్రుల ఆగ్రహం చోద్యం చూస్తున్న అధికారులు చిన్నగొట్టిగల్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు జూన్ కోటా కింద జనవరిలో చంద్రన్న సంక్రాంతి కానుకలో మిగిలిన, పురుగులు పట్టిన కంది పప్పును పంపిణీ చేయడంపై పెద్ద దుమారం రేగింది. ఈ పప్పుతోనే వంటలు వండుతుండడంతో తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోక పోవడంతో దీన్నే వినియోగిస్తున్నామని అంగన్వాడీ కార్యకర్తలు చేతులెత్తేస్తున్నారు. రొంపిచెర్ల: రొంపిచెర్ల సివిల్ సప్లయిస్ గోడౌన్ నుంచి చిన్నగొట్టిగల్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు జూన్‌నెల కోటా కింద నాసిరకం కందిపప్పును పంపిణీ చేశారు. జనవరిలో చంద్రన్న సంక్రాంతి కానుకలో మిగిలి, పురుగులు పట్టిన కంది పప్పును సివిల్ సప్లయియ్స్ గోడౌన్ నుంచి చౌక డిపోలకు సరఫరా చేయగా, వారు అంగన్ వాడీ కేంద్రాలకు పంపిణీ చేశారు. రొంపిచెర్ల వుండలంలోని 37 అంగన్వాడీ కేంద్రాలు, ఎర్రావారిపాళ్యెం మండలంలోని 37 కేంద్రాలు, చిన్నగొట్టిగల్లు మండలంలోని 29 కేంద్రాలకు బియ్యుం, కంది పప్పు, వంట నూ నెను 88 చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో అదే పప్పును అవుృతహస్తం పథకం కింద గర్భిణులు, బాలింతల వుధ్యాహ్న భోజనం కూరలకు వాడుతున్నారు. కొన్ని చోట్ల పురుగులు పడి చెడి పోరుున కంది పప్పుపై అంగన్వాడీ కార్యకర్తలను పిల్లల తల్లిదండ్రులు నిలదీశారు. దీనిపై అంగన్వాడీ కార్యకర్తలు పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు పట్టించుకోక పోవడంతో అదే కంది పప్పును వాడాల్సి వస్తోందని కార్యకర్తలు చెబుతున్నారు. చంద్రన్న కానుక కంది పప్పు ఇచ్చాం.. అంగన్వాడీ కేంద్రాలకు ఐదు క్వింటాళ్ల చంద్రన్న సంక్రాంతి కంది పప్పును ఇచ్చిన వూట వాస్తవమే. చంద్రన్న సంక్రాంతి కానుకలో మిగిలి పోరుున కంది పప్పును జిల్లా అధికారులు రొంపిచెర్ల సవిల్ సప్లయిస్ గోడౌన్‌కు పంపారు. అదే పప్పను అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేశాం. పప్పు బాగా లేకపోతే దానిని వాపసు చేయువచ్చు. దాని స్థానంలో వుంచి కంది పప్పును ఇస్తాం. 2600 నెరుు్య ప్యాకెట్లు చెడి పోరుున వూట వాస్తవమే. అప్పుటి డీటీ నిర్లక్ష్యమే కారణం. ఇప్పుడు మేము ఏమీ చేయులేం. - సివిల్ సప్లయిస్ అధికారి నాగరాజ కంపుకొడుతున్న చంద్రన్న కానుక నెరుు్య గత ఏడాది జూలైలో రంజాన్ చంద్రన్న కానుకగా పంపిణీ చే సిన నెరుు్య రొంపిచెర్ల సివిల్ సప్లయిస్ గోడౌన్లో కంపు కొడుతుంది. అప్పట్లో 2600 ప్యాకెట్ల నెయ్యి మిగిలిపోయింది. ఈ నెరుు్య ప్యాకెట్లను అప్పుడే వాపసు చేయాల్సి ఉండగా, అప్పటి డీటీ శ్రీకాంత్ పట్టించుకోలేదు. దీంతో సువూరు రూ.95 వేల విలువ చేసే నెరుు్య ప్యాకెట్లు గోడౌన్లో కంపు కొడుతున్నారుు. -
జపాన్ చేరుకున్న జైట్లీ
టోక్యో: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం జపాన్ చేరుకున్నారు. పెట్టు బడులను రాజట్టడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాననుంది. ఇందులో భాగంగా జపాన్ అధ్యక్షుడు షింజొ అబేతో జైట్లీ సమావేశమవనున్నారు. సాప్ట్ బ్యాంకు సీఈఓ మసాయోసి సన్, భారతదేశంలో అతిపెద్ద మోటారు పెట్టుబడిదారు సజుకీ కంపెనీ చైర్మన్ ఒసామా సుజుకి, పలువురు పారిశ్రామిక ప్రముఖులతో ఆయన భేటీ కానున్నారు. రూ.40,000 కోట్ల పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. -
ఉగాదికి తీపిలేదు!
♦ రేషన్ చక్కెరకు ప్రభుత్వం మంగళం ♦ రెండు నెలలుగా విడుదలకాని కోటా ♦ ఇప్పటికే కందిపప్పు ఆపేసిన సర్కారు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పేద ప్రజలకు ఇది చే దు వార్త. చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే చక్కెరకు ప్రభుత్వం మంగళం పాడింది. ప్రతి కార్డుకు అరకిలో చొప్పున పంచ దార సరఫరా చేస్తున్న ప్రభుత్వం రెండు నెలలుగా పంపిణీని నిలిపివేసింది. మార్చి, ఏప్రిల్‌కు సంబంధించి 1,170 మెట్రిక్ టన్నుల చక్కెర కోటా రాకపోవడంతో తొలిపండగ ఉగాది పచ్చడిలో తీపికి అవకాశంలేకుండా పోయింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 11.40 లక్షల రేషన్‌కార్డులకు ప్రతినెలా అరకేజీ చొప్పున 585 టన్నుల చక్కెరను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. అయితే, ఈ కోటాను గత రెండు నెలలుగా విడుదల చేయకపోవడంతో 120 టన్నుల బఫర్‌స్టాకును జిల్లా పౌరసరఫరాల శాఖ సర్దుబాటుచేసింది. కాప్రా, రామంతాపూర్, యాచారం, వికారాబాద్, పరిగి, ఘట్కేసర్, మహేశ్వ రం కేంద్రాల్లో ఉన్న నిల్వలను కార్డుదారులకు అందజేసింది. అయితే, తాజా పరిస్థితులను గమనిస్తే చక్కెరను కూడా ఎత్తివేసే అవకాశం కనిపిస్తోందని అధికారవర్గా లు అంటున్నాయి. ఇప్పటివరకు ప్యాకింగ్‌కు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరాచేసే సరుకులను తగ్గించుకుంటూ వస్తున్న సర్కారు.. మూడు నెలలుగా కంది పప్పు పంపిణీ నిలిపివేసింది. తాజాగా పంచదారనూ పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో కేవలం చౌక బియ్యం పంపిణీకే పరిమితం కానున్నట్లు అర్థమవుతోంది. -
భోజనం అసంపూర్ణం
♦ రెండు నెలలుగా పప్పుకూర లేదు ♦ అంగన్వాడీలకు సరఫరా కాని కందిపప్పు ♦ ‘ఆరోగ్య లక్ష్మి’ పథకం అభాసుపాలు ♦ గర్భిణులు, పిల్లలకు కూరగాయలతోనే భోజనం ♦ టెండర్ల నిర్వహణలో జాప్యం ఇందూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘ఆరోగ్య లక్ష్మి’ పథకం ఆపదలో పడింది. రెండు నెలలుగా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు ‘కందిపప్పు’ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఒక పూట సంపూర్ణ భోజనం పప్పు కూర లేకుండా అసంపూర్ణంగా చేసి వెళుతున్నారు. రెండు నెలలుగా పప్పు రుచి చూడకుండా కూరగాయల భోజనంతోనే సరిపెట్టుకుంటున్నారు. అది కూడా నాణ్యత లేని కూరగాయలతో కార్యకర్తలు భోజనం వండి పెడుతున్నారు. దీనంతటికి కారణం అధికారులు టెండర్లు నిర్వహించకపోవడమే. జిల్లాలోని నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, భీమ్‌గల్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, మద్నూరు, కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి ప్రాజెక్టుల కింద మెయిన్, మినీ కలిపి మొత్తం 2,711 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల్లో 1,38,671 మంది పిల్లలు, 42,122 మంది గర్భిణులు, బాలింతలు అనుంబంధ పోషకాహారం తిని వెళుతున్నారు. ప్రభుత్వం అందించే పప్పు, కూరగాయలతో వీరికి ప్రతిరోజు సంపూర్ణ భోజనం పెట్టాలి. అందులో భాగంగానే 2015 జనవరి1 నుంచి ఆరోగ్య లక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. కూరగాయలు కొనుక్కునే బాధ్యతను అంగన్వాడీ కార్యకర్తలకే ఇచ్చారు. కానీ కంది పప్పును మాత్రం మొన్నటి వరకు ప్రభుత్వం రాష్ట్ర సివిల్ సప్లయి శాఖ ద్వారా జిల్లాకు సరఫరా చేసింది. అయితే ఫిబ్రవరి నుంచి జిల్లాకు కంది పప్పును సరఫరా చేయడం లేదు. ఆయా జిల్లాల్లోనే టెండర్లు నిర్వహించుకుని కందిపప్పును అంగన్వాడీ కేంద్రాలకు పింపిణీ చేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం సూచించింది. టెండర్లను నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయగా.. అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న కందిపప్పు నిల్వలు మొత్తం ఖర్చు కావడంతో రెండు నెలలుగా కందిపప్పు కూరను వండి కేంద్రానికి వచ్చే వారికి పెట్టడం లేదు. కేవలం కూరగాయలతోనే భోజనం చేసి వెళ్లడం గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఇబ్బంది కరంగా మారింది. పప్పు కూర వండిపెట్టడం లేదని కార్యకర్తలను ప్రశ్నిస్తున్నారు. కేవలం గుడ్లు, పాలతో సరిపెట్టుకుని వెలుతున్నారు. తద్వారా ప్రభుత్వ లక్ష్యం అయిన మాత, శిశు మరణాల తగ్గింపుపై, పిల్లల బరువు పెరుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉంది. టెండర్ల నిర్వహణలో జాప్యం ఎందుకో... జిల్లాలో ఉన్న 2,711 అంగన్వాడీ కేంద్రాలకు గాను ప్రతినెలా 470 క్వింటాళ్ల కందిపప్పు అవసరం అవుతోంది. పది ప్రాజెక్టులకు గాను ఒక్కో ప్రాజెక్టుకు 35-60 క్వింటాళ్ల వరకు కందిపప్పు సరఫరా అవుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి భోజనం తిని వెళ్లే వారు ఎక్కువగా పప్పుకూరనే ఇష్టపడుతారు. పప్పు లేకపోవడంతో తినకుండానే కేంద్రం నుంచి వెళ్లిపోతున్నారు. అయితే రాష్ట్ర సివిల్ సప్లయి శాఖ నుంచి సరఫరా నిలిచిపోయిన వెంటనే ఐసీడీఎస్ ఉన్నతాధికారులు అప్రమత్తం అయి కందికప్పును యథావిధిగా కేంద్రాలకు సరఫరా చేయాలి. కానీ టెండర్ల నిర్వహణలో జాప్యం చేయడం వల్ల రెండు నెలలుగా కేంద్రాలకు పప్పు సరఫరా కావడం లేదు. అసలు టెండర్లను నిర్వహించడంలో ఆలస్యం ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు. ప్రాసెస్‌లో ఉంది.. అంగన్వాడీ కేంద్రాలకు రెండు నెలలుగా కందిపప్పు సరఫరా నిలిచిపోవడంపై ఐసీడీఎస్ పీడీ మీరా బెనర్జీని ఫోన్లో సంప్రదించగా.. టెండరు ప్రాసెస్‌లో ఉంది అంటూ ఫోన్ పెట్టేశారు. -
పేదలపై పెనుభారం
మండపేట :నిత్యావసర ధరలను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం.. పేదలపై తాజాగా మరింత భారం మోపింది. రేషన్ దుకాణాల ద్వారా రాయితీపై సరఫరా చేస్తున్న కందిపప్పు ధరను రూ.50 నుంచి రూ.90కి పెంచేసింది. పెరిగిన ధర ఈ నెల నుంచే అమలులోకి రానుంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో పంటల సాగుతగ్గిపోతుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అయినప్పటికీ నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకుని నిల్వ చేయడంలో రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. ఇదే అవకాశంగా కొందరు ఉన్న సరుకును నల్లబజారుకు తరలించి, ధరలు పెంచేసి, సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో బహిరంగ మార్కెట్లో పప్పు దినుసులు, చింతపండు, ఎండుమిర్చి, వంట నూనెలు, బియ్యం, కూరగాయల ధరలు భగ్గుమంటూండటంతో పేద, మధ్యతరగతివారి జీవనం దుర్భరంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కిలో కందిపప్పు ధర రూ.200కు చేరిపోయింది. రూ.140కే కిలో కందిపప్పు అందిస్తున్నట్టు అధికారులు ప్రకటించినా అది ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. ధరల నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ భారాన్ని పేదలపై మోపుతూ నిర్ణయం తీసుకుంది. కొరత పేరిట చౌక దుకాణాల ద్వారా రాయితీపై కిలో రూ.50కి అందిస్తున్న కందిపప్పు ధరను రూ.90కి పెంచింది. జిల్లాలో 14,10,206 తెల్లరేషన్ కార్డులు, 1,523 అన్నపూర్ణ, 89,145 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. వీరికి 2,643 రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారు. వీరికి 1,509 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. కాగా పెరిగిన ధర మేరకు ఒక్కో కార్డుదారునిపై రూ.40 అదనపు భారం పడనుంది. దీని ప్రకారం కార్డుదారులపై సుమారు రూ.6 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వం మోపింది. నవంబరు నెలకుగానూ ఇప్పటికే కిలో రూ.50 చొప్పున కొందరు డీలర్లు డీడీలు తీయగా, కందిపప్పు ఇంకా రేషన్ దుకాణాలకు చేరలేదు. ఈపోస్ మిషన్‌లో అందించే సరుకుల జాబితా నుంచి కందిపప్పును తొలగించారు. పెరిగిన ధర మేరకు ప్రభుత్వం సాప్ట్‌వేర్‌లో సాంకేతిక మార్పులు చేసి కందిపప్పు సరఫరాకు చర్యలు తీసుకోవచ్చునని అధికారులు అంటున్నారు. ఏదేమైనా రాయితీ కందిపప్పు ధరను ప్రభుత్వం పెంచడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సబ్సిడీ కందిపప్పు పంపిణీకి బ్రేక్
తాండూరు: ఒకవైపు పేద వర్గాలకు అందజేసే సబ్సిడీ కందిపప్పు పంపిణీకి బ్రేక్ పడగా.. మరోవైపు బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర ఆకాశాన్నంటుతుండటంతో మధ్యతరగతి జీవులు బెంబేలెత్తుతున్నారు. ఈ తరుణంలో సబ్సిడీ కందిపప్పు అందక సామాన్యులు అవస్థలు పడుతున్నారు. రంజాన్ పండుగ వేళ పేద వర్గాలకు తిప్పలు తప్పని పరిస్థితి. పౌరసరఫరాల శాఖ అధికారులు జూన్ నెల కోటా పప్పును కేటాయించకపోవడమే ఇందుకు ఉదాహరణ. దీంతో పౌరసరఫరాల గోదాంలో కందిపప్పు నిల్వలు నిండుకున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా జరగాల్సిన సబ్సిడీ కందిపప్పు పంపిణీ ఆగిపోయింది. పండగ సందర్భంగా అదనపు చక్కర కోటాను కేటాయించిన సివిల్ సప్లయ్ అధికారులు కందిపప్పు పంపిణీపై మాత్రం శ్రద్ధ చూపకపోవడం గమనార్హం. జిల్లాలో మొత్తం 1,854 రేషన్ దుకాణాలున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా రూ.49.45 ధరకు కిలో కందిపప్పును పేదలకు పంపిణీ చేస్తారు. ప్రతి నెలా జిల్లా వ్యాప్తంగా దాదాపు 350-400 మెట్రిక్ టన్నుల కందిపప్పు కోటా అవసరం. కానీ ఈ నెల కోటా ఇంత వరకు కేటాయించలేదు. బహిరంగ మార్కెట్లో ఇటీవల కంది పప్పు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కిలో కందిపప్పు రూ.110-రూ.120 ధర పలుకుతోంది. ఈ పరిస్థితిలో అంత ధరతో కందిపప్పును కొనేస్థోమత లేక సామాన్యులు ఇక్కట్లకు గురవుతున్నారు. కారణాలివీ.. మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో పౌరసరఫరాల శాఖకు ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల నుంచి సప్లయర్ల నుంచి కందిపప్పు నిలిచిపోయింది. ప్రతి మూడు మాసాలకోసారి పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు కందిపప్పు సప్లయ్‌కి సంబంధించి టెండర్లు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ ఇంకా ఖరారు కాలేదు. మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల కారణంగానే సప్లయర్లతో కందిపప్పు టెండర్ల కాంట్రాక్టులో ఆలస్యానికి కారణమవుతోందని తెలుస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా పౌరసరఫరాల గోదాం (ఎంఎల్ఎస్ పాయింట్)లకు కందిపప్పు కోటా చేరలేదు. మే నెల కోటాను పంపిణీ చేసిన అధికారులు జూన్ మాసం కోటా అలాట్మెంట్ చేయకపోవడంతో పేదలకు కందిపప్పు పంపిణీకి బ్రేక్ పడింది. టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది: సత్యం, డీఎం సప్లయర్లతో కాంట్రాక్టు ఇంకా ఖరారు కానందున ఈ నెల కంది పప్పు కోటా కేటాయింపులు జరగలేదని శనివారం సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ సత్యం చెప్పారు. ఈ కారణంతోనే ఈ నెల కందిపప్పు పంపిణీలో ఆలస్యానికి కారణమన్నారు. సోమ, మంగళవారం నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది .ఈ ప్రక్రియ ముగియగానే కందిపప్పు పంపిణీ ప్రారంభమవుతుందని డీఎం వివరించారు. రంజాన్ పండగ కోసం జిల్లా వ్యాప్తంగా 1,195 మెట్రిక్ టన్నుల అదనపు చక్కర కోటాను కేటాయించినట్టు డీఎం తెలిపారు. లబ్ధిదారులకు ఒక కిలో చక్కర అదనంగా పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.