సీఎం కోసం ట్యాంకర్ల తరలింపు | tankers for cm toor | Sakshi
Sakshi News home page

సీఎం కోసం ట్యాంకర్ల తరలింపు

Published Fri, Sep 2 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

సీఎం కోసం ట్యాంకర్ల తరలింపు

సీఎం కోసం ట్యాంకర్ల తరలింపు

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు.. సీఎం పర్యటన కాస్తా ట్యాంకర్ల యాజమాన్యాలకు తలనొప్పిగా మారింది. శుక్రవారం సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలోని నలుమూలల ట్యాంకర్లను హడావుడిగా ఆలూరుకి తరలించారు. కనీసం సంబంధిత యజమానులకు సమాచారం ఇవ్వకుండానే తరలించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరలించిన ట్యాంకర్ల ద్వారా నీటిని రెయిన్‌గన్‌లతో పంటలు తడిపి కాపాడుతున్నామనే కలరింగ్‌ ఇచ్చేందుకు జిల్లా ఉన్నతాధికారులు హడావుడి చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు ట్యాంకర్ల డ్రై వర్లకు తిండీ తిప్పలకు ఏర్పాట్లు కూడా చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ట్యాంకర్ల తరలింపు వ్యవహారం కాస్తా జిల్లా కలెక్టర్‌కు, ఆదోని ఆర్డీఓకు మధ్య వాగ్వివాదానికి కారణమయిందని తెలుస్తోంది. ఇక ట్యాంకర్లు లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో అపార్ల్‌మెంట్లలో నివాసం ఉంటున్న ప్రజలు నీటి సమస్యతో అల్లాడిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement