త్రిపురారం : ఆడపిల్లంటే సృష్టికి మూలం.. ఇంటికి దీపం.. మరో అమ్మ. కానీ, అదే ఆడపిల్లను భారంగా భావిస్తోంది నేటి సమాజం. ఆర్థిక పరిస్థితులు, నిరక్షరాస్యత, కారణాలు ఏవైతేనేం.. ఆడపిల్లలను కాదనుకుంటున్నారు కన్న తల్లిదండ్రులు. ఇందుకు త్రిపురారం మండలంలోని డొంకతండానే నిదర్శనం. వివరాల్లోకి వెళ్లితే గుంటూరు జిల్లా గురజాల మండలం అంభాపురం గ్రామానికి చెందిన అరుణతో డొంక తండాకు చెందిన ధనావత్ శ్రీనుకు రెండేళ్ల క్రితం వివాహం అయింది.
వీరికి ఒక కుమార్తె ఉన్నారు. ఆరు నెలల క్రితం ధనావత్ అరుణ రెండో కాన్పు కోసం తన పుట్టింటికి వెళ్లింది. అయితే అరుణ కాన్పు కావడంతో కుమార్తె జన్మించింది.
కాన్పుతో వెళ్లి.. ఒంటరిగా తిరిగొచ్చి..
ఆరు నెలల పాటు తన పుట్టింటిలో ఉన్న ఆమె నాలుగు రోజుల క్రితం అత్తగారి ఇంటికి ఒంటరిగా వచ్చింది. అరుణ తన బిడ్డతో రాకుండా ఒంటరిగా వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామ అంగన్‌వాడీ టీచర్, సూపర్‌వైజర్ శుక్రవారం ఐసీడీఎస్ సీడీపీఓ పద్మావతికి సమాచారం ఇచ్చారు. సీడీపీఓ గ్రామానికి వచ్చి ధనావత్ అరుణను విచారించింది. దీంతో అరుణ శిశువును విక్రయించినట్లు ఒకసారి, కామెర్లు పోసి శిశువు చనిపోయినట్లు మరోసారి సమాధానం చెప్పింది. దీంతో మే 2వ తేదీలోగా శిశువు జాడ తమకు చెప్పాలని ఐసీడీఎస్ అధికారులు ధనావత్ అరుణను కోరారు.
ఆడపిల్లను ‘అమ్మే’సింది..?
Published Sat, Apr 30 2016 4:52 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement