పసిగుడ్డును రోడ్డుపై వదిలేశారు | Parents leave baby on road, rescued | Sakshi
Sakshi News home page

పసిగుడ్డును రోడ్డుపై వదిలేశారు

Published Fri, May 6 2016 10:13 PM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

Parents leave baby on road, rescued

ఆత్మకూరురూరల్(శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు): ఒక రోజు వయసున్న బిడ్డను వస్త్రంలో చుట్టి రోడ్డుపై వదిలి వెళ్లిన దారుణమైన సంఘటన ఆత్మకూరు మండలంలోని బోయిల చిరువెళ్ల గ్రామ సరిహద్దుల్లో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంకాల సమయంలో పొలిమేర్ల నుంచి వస్తున్న పశువుల కాపరులు పొదల్లో ఏడుపు వినిపించి చూడగా బిడ్డ కనిపించడంతో గ్రామపెద్దలకు సమాచారం అందించారు.


గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, శ్యామలమ్మ దంపతులు సంఘటన స్థలానికి చేరుకొని బిడ్డను అక్కున చేర్చుకున్నారు. ఆడపిల్ల భారమనుకున్నారో ఏమో కానీ బిడ్డను రోడ్డు పక్కన వదిలి వెళ్లడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు. ఎవరైనా వాహనంలో వచ్చి జన సంచారం లేని సమయంలో రోడ్డు పక్కన వదిలి పెట్టి ఉంటారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కాగా, సుబ్బారెడ్డి దంపతులు తమకు ముగ్గురూ మగపిల్లలే అని.. ఆడపిల్లను దేవుడిచ్చిన వరంగా పెంచుకుంటామని అంటుండగా గ్రామానికి చెందిన మరో దంపతులు తమకు వివాహమై 15 ఏళ్లు అయినా సంతానం లేదని.. తమకు అప్పగిస్తే ఆ పాపను పెంచుకుంటామని పేర్కొన్నారు. గ్రామ పెద్దలు పోలీసులు, ఐసీడీసీఎస్ అధికారులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement