Aatmakuru
-
బాబు నివాసం వద్ద టీడీపీ నేతల ఓవరాక్షన్
సాక్షి, గుంటూరు: టీడీపీ కార్యకర్తల బరితెగింపుతో పల్నాడు ప్రాంతంలో టెన్షన్ వాతవారణం నెలకొంది. ప్రశాంతతను చెదరగొట్టి చిచ్చు రగిల్చేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తుగా 144 సెక్షన్‌ను అమలు చేశారు. అయినా పోలీసుల హెచ్చరికలను లెక్కచేయని టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నచ్చచెప్పేందుకు పోలీసులు ప్రయత్నించినా.. నారా లోకేష్, మరికొందరు నేతలు వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో చంద్రబాబు నివాస పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా బుధవారం తెల్లవారుజామునుంచి చంద్రబాబు ఇంటివద్ద టీడీపీ నేతలు ఓవర్ యాక్షన్‌కు దిగుతున్నారు. కార్యకర్తలను రెచ్చగొడుతూ.. రోడ్లపైకి పంపుతున్నారు. ముందస్తు హౌస్ అరెస్ట్ సేవ్ పల్నాడు పేరుతో ఛలో ఆత్మకూరుకు ఇరుపార్టీలు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరుపక్షాల మోహరింపుతో పల్నాడులో ఉత్కంఠగా మారింది. బుధవారం ఉదయం 9 గంటలకు ఆత్మకూరు బయల్దేరాలని టీడీపీ నేతల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. తమ అనుమతి లేకుండా ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలు చేయవద్దని ఆదేశాలు జారీచేశారు. శాంతిభధ్రతల పరిరక్షణలో భాగంగా కొంతమంది నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేస్తున్నారు. గుంటూరుతో సహా సమస్యాత్మక ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. -
చంద్రబాబుకు షాకిచ్చిన కార్యకర్తలు
సాక్షి, గుంటూరు: పల్నాడు ప్రాంతంలో ప్రశాంతను చెదరగొట్టి చిచ్చు రగిల్చేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తామకెలాంటి సమస్యలను లేవని అక్కడి ప్రజానీకం చెబుతున్నా.. కేవలం కుట్రపూరితంగా టీడీపీ నేతలు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో పోలీసులు అధికారులు 144 సెక్షన్ అమలు చేశారు. తమ అనుమతి లేకుండా ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలు చేయవద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీచేశారు. శాంతి భద్రతల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తమకు సహకరించాలని ఆయన కోరారు. పల్నాడులో ఎటువంటి అవాంచనీయ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని డీజీపీ తెలిపారు. సొంత గ్రామాలకు కార్యకర్తలు మరోవైపు గుంటూరు జిల్లా ఆత్మకూరు వాతావరణం ప్రశాంతంగానే ఉందని డీఎస్పీ హరి తెలిపారు. గతంలో ఒకే కుంటుంబానికి చెందిన ఎస్సీల మధ్య గొడవలు జరిగాయని, అవన్ని కేవలం కుటుంబ వివాదాలే అని తేల్చిచెప్పారు. వారి కుటుంబ గొడవలతో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. పోలీసుల ప్రకటనతో టీడీపీ పునరావాస ఉన్న పార్టీ కార్యకర్తలు చిన్నగా జారుకుంటున్నారు. తమను అడ్డంపెట్టకుని నేతలు రాజకీయం చేస్తున్నారని గమనించిన క్యాడర్.. తమ సొంత గ్రామాలకు తరలివెళ్లిపోతున్నారు. తమ కుటుంబ సమస్యలను రాజకీయ పార్టీల అవసరాలకు వాడుకుంటున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల వైఖరితో టీడీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. నిన్నటి వరకూ అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, కే–ట్యాక్సులతో అట్టుడికిన పల్నాడు ప్రాంతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రశాంతంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్రపూరితంగా ప్రశాంత పల్నాడులో చిచ్చుపెట్టే చర్యలు చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు వారికి వంతపాడుతూ నీచ రాజకీయాలకు తెరదీశారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం, టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, జి.వి.ఆంజనేయులు పల్నాడులో సాగించిన ఫ్యాక్షన్ రాజకీయాలను విస్మరించి, ఇప్పుడు ఏదో జరిగిపోతోందంటూ చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఈ దిగజారుడు రాజకీయాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. యరపతి నేని శ్రీనివాసరావు, కోడెల కుటుంబం పాల్పడిన అక్రమాలు, దౌర్జన్యాలతో నష్టపోయిన బాధితులతో గుంటూరులోని పార్టీ కార్యాలయం నుంచి ఆత్మకూరు వెళ్లేందుకు నిర్ణయించారు. (చదవండి: పల్నాట కపట నాటకం!) -
పల్నాడులో 144 సెక్షన్ : డీజీపీ
సాక్షి, అమరావతి : పల్నాడులో 144,30 సెక్షన్ విధించామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమన్నారు. శాంతి భద్రతల విషయంలో అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని కోరారు. వినాయక నిమజ్జనం, మొహరం పండుగల నేపథ్యంలో ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పల్నాడులో ఎటువంటి అవాంచనీయ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని డీజీపీ తెలిపారు. కాగా, తమ శ్రేణులపై దాడులు చేస్తున్నారంటూ టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు ఒకరి ఒకరు పోటీగా బాధితుల కోసం పల్నాడులో పునరావాస శిబిరాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్నాడులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆత్మకూరులో ప్రశాంత వాతావరణం : గురజాల డీఎస్పీ ఆత్మకూరులో ప్రశాంత వాతావరణం నెలకొందని గురజాల డీఎస్పీ శ్రీహరి అన్నారు. గతంలో ఒకే కుటుంబానికి చెందిన ఎస్సీల మధ్య గొడవలు జరిగాయని, అవన్ని కుటుంబ వివాదాలే అన్నారు. వాటితో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసుల చొరవతో వారంతా కలిసిపోయారని, ఇప్పడు గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొందని శ్రీహరి తెలిపారు. ఐజీని కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రేపటి ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను కలిశారు. టీడీపీ బాధితులకు న్యాయం చేసేందుకు చేపట్టబోయే ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఐజీని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, బొల్లా బ్రాహ్మనాయుడు, ఎంపీలు నందిగం సురేష్, లావు శ్రీకృష్ణ దేవరాయలు, పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం తదితరులు ఉన్నారు. -
ఆత్మకూరులో కాదు పరకాలలో రెఫరెండం పెడదాం
ప్రజల చిరకాల వాంఛ సీఎంను ఎమ్మెల్యే ఒప్పించాలి శాంతియుత మార్గంలో ప్రజాపోరాటం కొనసాగిస్తాం నిరవధిక దీక్ష విరమణలో ఇనుగాల వెంకట్రామ్రెడ్డి పరకాల : పరకాలను రెవిన్యూ డివిజ¯ŒS ఏర్పాటు ప్రజల చిరకాల వాంఛ అని కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ ఇ¯ŒSచార్జి ఇనుగాల వెంకట్రామ్రెడ్డి అన్నారు. రెవిన్యూ డివిజ¯ŒS కోసం మూడు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న ఇనుగాల వెంకట్రామ్రెడ్డి సోమవారం విరమించారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన దీక్ష ముగింపు కార్యక్రమంలో కార్యకర్తలు, ప్రజలనుద్ధేశించి వెంకట్రామ్రెడ్డి మాట్లాడారు. పరకాలను కొత్తగా రెవిన్యూ డివిజ¯ŒSగా కోరడం లేదని పాత దానినే పునరుద్ధరించమని కోరుతున్నామన్నారు. ఆత్మకూరులో ప్రజాదర్భార్ కాకుండా పరకాలలో రెఫరెండం పెడితే ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో తేలిపోతుందన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాను ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దీక్ష చేస్తుంటే ప్రజల కోరికను ఎమ్మెల్యే ధర్మారెడ్డి చులకన చేసి మాట్లాడుతున్నారన్నారు. తొర్రూర్, హుస్నాబాద్‌లను ప్రజలు అడగక ముందే ఎమ్మెల్యేలు చెప్పడంతో రెవిన్యూ డివిజన్లుగా ప్రకటించారన్నారు. పరకాలలో మాత్రం ప్రజలు అడుగుతున్న ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. డివిజ¯ŒS కోసం ఎమ్మెల్యే సీఎం కేసీఆర్‌ను ఒప్పించాలని ఆయన కోరారు. రెవిన్యూ డివి జ¯ŒS రాకపోతే పరకాల ఉనికికే ప్రమాదం ఏర్పడబోతుందన్నారు. డివిజ¯ŒS సాధన కోసం ఇక నుంచి అన్నివర్గాల ప్రజలను కలుపుకుని గాంధీమార్గంలో ఆందోళన కార్యక్రమాలను చేపడుతామన్నారు. దీక్షకు సహరించిన అన్ని వర్గాల ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ధర్మారెడ్డి ఎజెండా అర్ధం కావడం లేదు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎజెండా ఏమిటో అర్ధం కావడం లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి అన్నారు. మూడు రోజులుగా దీక్ష చేస్తున్న ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. అనంతరం డాక్టర్ విజయచందర్‌రెడ్డి మాట్లాడుతూ చల్లా ధర్మారెడ్డి గెలుపు కోసం తాను నియోజకవర్గంలో ప్రచారం చేశానన్నారు. కాంట్రాక్ట్ పనుల నుంచి బయటకు వచ్చి ప్రజల మనోభావాలను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బండి సారంగపాణి, ఓడీసీఎంఎస్ వైస్ చైర్మ¯ŒS గోల్కోండ సదానందం, డీసీసీ ప్రధాన కార్యదర్శి బొచ్చు కష్ణారావు, పీఏసీఎస్ చైర్మ¯ŒS కట్కూరి దేవేందర్‌రెడ్డి, చెన్నోజు బిక్షపతి, మడికొండ శ్రీను, కొయ్యడ శ్రీనివాస్, ఆత్మకూరు జడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి, రమేష్, బీజేపీ నాయకులు ఆర్పీ జయంత్‌లాల్, గోపినాథ్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. – డాక్టర్ విజయచందర్‌రెడ్డి -
పసిగుడ్డును రోడ్డుపై వదిలేశారు
ఆత్మకూరురూరల్(శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు): ఒక రోజు వయసున్న బిడ్డను వస్త్రంలో చుట్టి రోడ్డుపై వదిలి వెళ్లిన దారుణమైన సంఘటన ఆత్మకూరు మండలంలోని బోయిల చిరువెళ్ల గ్రామ సరిహద్దుల్లో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంకాల సమయంలో పొలిమేర్ల నుంచి వస్తున్న పశువుల కాపరులు పొదల్లో ఏడుపు వినిపించి చూడగా బిడ్డ కనిపించడంతో గ్రామపెద్దలకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, శ్యామలమ్మ దంపతులు సంఘటన స్థలానికి చేరుకొని బిడ్డను అక్కున చేర్చుకున్నారు. ఆడపిల్ల భారమనుకున్నారో ఏమో కానీ బిడ్డను రోడ్డు పక్కన వదిలి వెళ్లడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు. ఎవరైనా వాహనంలో వచ్చి జన సంచారం లేని సమయంలో రోడ్డు పక్కన వదిలి పెట్టి ఉంటారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కాగా, సుబ్బారెడ్డి దంపతులు తమకు ముగ్గురూ మగపిల్లలే అని.. ఆడపిల్లను దేవుడిచ్చిన వరంగా పెంచుకుంటామని అంటుండగా గ్రామానికి చెందిన మరో దంపతులు తమకు వివాహమై 15 ఏళ్లు అయినా సంతానం లేదని.. తమకు అప్పగిస్తే ఆ పాపను పెంచుకుంటామని పేర్కొన్నారు. గ్రామ పెద్దలు పోలీసులు, ఐసీడీసీఎస్ అధికారులకు సమాచారం అందించారు.