ఆత్మకూరులో కాదు పరకాలలో రెఫరెండం పెడదాం | Let's not referendum atmakuru | Sakshi
Sakshi News home page

ఆత్మకూరులో కాదు పరకాలలో రెఫరెండం పెడదాం

Published Mon, Sep 12 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

Let's not referendum atmakuru

  • ప్రజల చిరకాల వాంఛ
  •  సీఎంను ఎమ్మెల్యే ఒప్పించాలి
  • శాంతియుత మార్గంలో ప్రజాపోరాటం కొనసాగిస్తాం
  • నిరవధిక దీక్ష విరమణలో ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి
  • పరకాల : పరకాలను రెవిన్యూ డివిజ¯ŒS ఏర్పాటు ప్రజల చిరకాల వాంఛ అని కాంగ్రెస్‌ పార్టీ పరకాల నియోజకవర్గ ఇ¯ŒSచార్జి ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. రెవిన్యూ డివిజ¯ŒS కోసం మూడు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి సోమవారం విరమించారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన దీక్ష ముగింపు కార్యక్రమంలో కార్యకర్తలు, ప్రజలనుద్ధేశించి వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడారు. పరకాలను కొత్తగా రెవిన్యూ డివిజ¯ŒSగా కోరడం లేదని పాత దానినే పునరుద్ధరించమని కోరుతున్నామన్నారు.
     
    ఆత్మకూరులో ప్రజాదర్భార్‌ కాకుండా పరకాలలో రెఫరెండం పెడితే ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో తేలిపోతుందన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాను ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దీక్ష చేస్తుంటే ప్రజల కోరికను ఎమ్మెల్యే ధర్మారెడ్డి చులకన చేసి మాట్లాడుతున్నారన్నారు. తొర్రూర్, హుస్నాబాద్‌లను ప్రజలు అడగక ముందే ఎమ్మెల్యేలు చెప్పడంతో రెవిన్యూ డివిజన్లుగా ప్రకటించారన్నారు. పరకాలలో మాత్రం ప్రజలు అడుగుతున్న ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. డివిజ¯ŒS కోసం ఎమ్మెల్యే సీఎం కేసీఆర్‌ను ఒప్పించాలని ఆయన కోరారు. రెవిన్యూ డివి జ¯ŒS రాకపోతే పరకాల ఉనికికే ప్రమాదం ఏర్పడబోతుందన్నారు. డివిజ¯ŒS సాధన కోసం ఇక నుంచి అన్నివర్గాల ప్రజలను కలుపుకుని గాంధీమార్గంలో ఆందోళన కార్యక్రమాలను చేపడుతామన్నారు. దీక్షకు సహరించిన అన్ని వర్గాల ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. 
    ధర్మారెడ్డి ఎజెండా అర్ధం కావడం లేదు
     
    పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎజెండా ఏమిటో అర్ధం కావడం లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్‌ పెసరు విజయచందర్‌రెడ్డి అన్నారు. మూడు రోజులుగా దీక్ష చేస్తున్న ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. అనంతరం డాక్టర్‌ విజయచందర్‌రెడ్డి మాట్లాడుతూ చల్లా ధర్మారెడ్డి గెలుపు కోసం తాను నియోజకవర్గంలో ప్రచారం చేశానన్నారు. కాంట్రాక్ట్‌ పనుల నుంచి బయటకు వచ్చి ప్రజల మనోభావాలను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు బండి సారంగపాణి, ఓడీసీఎంఎస్‌ వైస్‌ చైర్మ¯ŒS గోల్కోండ సదానందం, డీసీసీ ప్రధాన కార్యదర్శి బొచ్చు కష్ణారావు, పీఏసీఎస్‌ చైర్మ¯ŒS కట్కూరి దేవేందర్‌రెడ్డి, చెన్నోజు బిక్షపతి, మడికొండ శ్రీను, కొయ్యడ శ్రీనివాస్, ఆత్మకూరు జడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి, రమేష్, బీజేపీ నాయకులు ఆర్‌పీ జయంత్‌లాల్, గోపినాథ్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
     – డాక్టర్‌ విజయచందర్‌రెడ్డి
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement