– సాక్షి ఎఫెక్ట్
కనగానపల్లి (రాప్తాడు) : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారం నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం తగదని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ఐసీడీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లు నాణ్యత లేకపోవడంపై ‘సాక్షి’లో శనివారం ‘ఉడికించు చూడ రబ్బరు గుడ్డు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి మంత్రి స్పందించారు. మండల కేంద్రం కనగానపల్లిలో అధికారులతో సమావేశం నిర్వహించారు. నాసిరకం గుడ్లు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయో గుర్తించాలని సీడీపీఓ వనజాక్షిని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన పీడీ నాసిరకం గుడ్లు బయటపడిన కనగానపల్లి మండలం కుర్లపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా నిర్ణీత కాల వ్యవధిలోనే గుడ్లను వినియోగించుకోవాలని సూచించారు.
పౌష్టికాహారంపై నిర్లక్ష్యం తగదు
Published Sat, Apr 15 2017 11:51 PM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement
Advertisement