minister fires
-
మంత్రి ఫైర్: రాస్కెల్, ఎగిరి తంతా!
సాక్షి, బెంగళూరు: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని మంత్రి జేసీ మాదుస్వామి అధికారులను హెచ్చరించారు. గురువారం జిల్లా పంచాయతీ సమావేశం హాల్లో అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టెండర్లు పిలిచినా ఎందుకు జాప్యం చేస్తున్నారని జెడ్పీ ఇంజినీర్ రంగస్వామిపై తీవ్రంగా మండిపడ్డారు. టెండర్ పిలిచి కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించాలని నేను 4వ తేదీన చెప్పినా కూడా ఇప్పటివరకు ఏం చేస్తున్నావు? రాస్కెల్, ఎగిరి తంతే ఎక్కడ పడతావో తెలుసా? పని చేయకుండా గాడిదలు కాస్తున్నావా అని మంత్రి అగ్గిమీద గుగ్గిలం కావడంతో అధికారులు కంగుతిన్నారు. పనిచేయని వాళ్లను ఇంటికి పంపించాలని జెడ్పీ సీఈఓకు మంత్రి స్పష్టంచేశారు. చదవండి: (చిక్కుల్లో నటి రాధికా కుమారస్వామి) -
టార్చిలైట్ వెలుగులో కంటి ఆపరేషన్లు
ఉన్నావ్(ఉత్తరప్రదేశ్): టార్చిలైటు వెలుతురులో 32 మందికి కంటి శుక్లాల ఆపరేషన్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. ఉన్నావ్ దగ్గర్లోని నవాబ్‌గంజ్‌లోని ఓ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం ఘటనపై విచారణకు ఆదేశించింది. ఘటనపై ఆరోగ్య మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నావ్ ప్రధాన వైద్య అధికారి(సీఎంవో) రాజేంద్ర ప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. హెల్త్ సెంటర్ ఇన్చార్జిని తొలగించారు. కాగా, ఆపరేషన్ తర్వాత రోగులను నేలమీద పడుకోబెట్టారని పలువురు ఆరోపించారు. ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడం, పవర్ బ్యాకప్ లేకపోవడంతో టార్చిలైటు వెలుతురులో శస్త్రచికిత్సలు చేసినట్లు తెలుస్తోంది. -
పౌష్టికాహారంపై నిర్లక్ష్యం తగదు
– సాక్షి ఎఫెక్ట్ కనగానపల్లి (రాప్తాడు) : అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారం నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం తగదని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ఐసీడీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లు నాణ్యత లేకపోవడంపై ‘సాక్షి’లో శనివారం ‘ఉడికించు చూడ రబ్బరు గుడ్డు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి మంత్రి స్పందించారు. మండల కేంద్రం కనగానపల్లిలో అధికారులతో సమావేశం నిర్వహించారు. నాసిరకం గుడ్లు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయో గుర్తించాలని సీడీపీఓ వనజాక్షిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన పీడీ నాసిరకం గుడ్లు బయటపడిన కనగానపల్లి మండలం కుర్లపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా నిర్ణీత కాల వ్యవధిలోనే గుడ్లను వినియోగించుకోవాలని సూచించారు.