ఐసీడీఎస్‌ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం | applications invite for idcs awards | Sakshi
Sakshi News home page

ఐసీడీఎస్‌ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

Published Sun, Dec 25 2016 12:06 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

applications invite for idcs awards

కర్నూలు(హాస్పిటల్‌): స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మూడు కేటగిరిల్లో ఇచ్చే అవార్డులకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు జి. అనురాధమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, చిన్నారులు, ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా వారికి ఈ అవార్డులు అందజేస్తారన్నారు. మహిళలు, చిన్నారులు, వివిధ వృత్తుల్లో పనిచేస్తున్న వారికి ఒక కేటగిరి, మహిళలు, పిల్లలు ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి రెండో కేటగిరి, ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తూ మహిళలకు సంబంధించి విషయాలపై పనిచేసిన వారిని మూడో కేటగిరిగా పరిగణించి అవార్డులు ప్రకటిస్తారన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 28వ తేదిలోపు కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో దరఖాస్తులు సీల్డ్‌కవర్‌లో అందజేయాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement