స్టార్టప్‌ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం | National Startup Awards 2021: DPIIT Invites Applications | Sakshi
Sakshi News home page

జాతీయ స్టార్టప్‌ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

Published Wed, Dec 23 2020 12:05 PM | Last Updated on Wed, Dec 23 2020 12:08 PM

National Startup Awards 2021: DPIIT Invites Applications - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ స్టార్టప్‌ అవార్డులు (ఎన్‌ఎస్‌ఏ) –2021 రెండో ఎడిషన్‌ను కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) ప్రారంభించింది. ఎన్‌ఎస్‌ఏ –2021కు జనవరి 31,2021 వరకూ దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. 15 విస్తృత రంగాల్లో 49 విభాగాల్లో స్టార్టప్‌లకు ఈ అవార్డులు ఇస్తారు.  విజేతలకు రూ.5లక్షల నగదు ఇవ్వడంతోపాటు రన్నరప్‌లకు కూడా పైలెట్‌ ప్రాజెక్టులు, వర్క్‌ ఆర్డర్లు పొందడానికి అవకాశాలు కల్పించనుంది. అవార్డుల దరఖాస్తుకు www.startupindia.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని డీపీఐఐటీ పేర్కొంది. (చదవండి: 2020 వాట్సాప్ లో వచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఇవే)

హ్యుందాయ్‌ గ్రేట్‌ ఇండియా డ్రైవ్‌ 4.0
హైదరాబాద్‌: రాబోయే కొత్త దశాబ్దికి స్వాగతం పలుకుతూ హ్యుందాయ్‌ మోటార్స్‌ ‘‘గ్రేట్‌ ఇండియా డ్రైవ్‌ 4.0’’కు శ్రీకారం చుట్టింది. ఈ డ్రైవ్‌లో కస్టమర్ల కోసం సరికొత్తగా రూపొందిందిన ప్రీమియం కారు ఐ 20 మోడల్‌ ప్రధానాకర్షణగా నిలుస్తుందని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ ఎస్‌ఎస్‌ కిమ్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా అటల్‌ టన్నెల్, డల్హౌసీ, గోవా, జైసల్మీర్, నర్ఖండా, భింతిక గుహలు, ఇండోర్, పుదుచ్చేరి, ఊటీ, కేరళ వంటి భిన్న ప్రాంతాల మీదుగా ఈ డ్రైవ్‌ కొనసాగనుంది. (చదవండి: ప్రతీ సెకనుకో బిర్యానీ.. స్విగ్గీ సీక్రెట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement