లేపాక్షి ఆలయంలో ప్రపంచ బ్యాంక్‌ బందం | world bank team at leapakshi | Sakshi
Sakshi News home page

లేపాక్షి ఆలయంలో ప్రపంచ బ్యాంక్‌ బందం

Published Fri, Aug 5 2016 11:45 PM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

world bank team at leapakshi

లేపాక్షి : లేపాక్షి దేవాలయాన్ని  శుక్రవారం మధ్యాహ్నం ప్రపంచ బ్యాంక్‌ బృందం అధికారులు ఢిల్లీ నుంచి అనిజైగబ్‌మ్యాచు, సబ్జార్‌ మహమ్మద్‌ షేక్, రాష్ట్రం నుంచి నరసింహరావు, జిల్లా నుంచి సుధాకర్‌ సందర్శించారు. ఆలయంలోని అపురూపమైన శిల్పాలు, చిత్రలేఖనాలు తిలకించి ఆనందించారు. ఏడు శిరస్సుల నాగేంద్రుడు, 70 స్తంభాల్లో చెక్కిన లేపాక్షి డిజైన్లు, కల్యాణ మండపం, నాట్యమండపం, అంతరిక్ష స్తంభం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ అర్చకులు సూర్యప్రకాష్‌రావు ద్వారా ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభధ్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ బ్యాంక్‌ బృందంలో భాగంగా ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ను బలోపేతం చేయడానికి ఇస్ని ప్రాజెక్ట్‌ ఉందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన దశలవారి శిక్షణ  కార్యక్రమాలు, సామూహిక సీమంతాలు, అన్నప్రాశన తదితర కార్యక్రమాలపై ఆరా తీశామన్నారు. హిందూపురం సీడీపీఓ నాగమల్లేశ్వరీ, ఏసీడీపీఓ సునిత ఆయన వెంట ఉన్నారు. అదేవిధంగా కర్ణాటకలోని లా కమిషన్‌ చైర్మన్‌ ఎస్‌ఆర్‌ నాయక్‌ శుక్రవారం ఉదయం లేపాక్షి ఆలయం సందర్శించారు.  ఆలయ విశిష్టతను గురించి ఆలయ అర్చకులు సూర్యప్రకాష్‌రావును అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement