అయ్యో.. పాపం! | child goes to icds home | Sakshi
Sakshi News home page

అయ్యో.. పాపం!

Published Fri, Aug 26 2016 11:33 PM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

అయ్యో.. పాపం! - Sakshi

అయ్యో.. పాపం!

→  కలహాలతో విడిపోయిన దంపతులు?
→  అనాథగా మారిన ఏడాదిన్నర చిన్నారి
→  శిశుసదన్‌కు తరలించిన ఐసీడీఎస్‌ అధికారులు

కనగానపల్లి : రెండేళ్ల చిన్నారికి ఎంత కష్టమొచ్చిందో.. ఏ పాపం ఎరుగని ఆ చిన్నా రి అనాథగా మారింది. అమ్మానాన్న మధ్య తలెత్తిన మనస్పర్ధలు ఆ చిన్నారిని ఒంటరి చేశాయి. ఏడాదిన్నర వయస్సు కలిగిన ఆ పాపను కనగానపల్లి మండ లం బద్దలాపురం ఎస్సీ కాలనీ సమీపంలో కన్నవారు శుక్రవారం ఉదయం ఒంటరిగా వదిలివెళ్లిపోయారని గ్రామస్తులు తెలిపారు. ఏడుస్తూ కనిపించిన పాపను స్థా నికులు గమనించి చేరదీశా రు. చుట్టుపక్కల వారిని విచారించారు. విష యం తెలుసుకున్న అంగన్‌వాడీ వర్క ర్లు ఐసీడీఎస్‌ అధికారుSకు సమాచా రం అందించారు.


సీడీపీఓ వనజాక్షి, సూపర్‌వైజర్‌ మీనాక్షమ్మ హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. పాప ను అనంతపురంలోని బాలశిశుసదన్‌కు తరలించారు. అయితే బద్దలాపురానికి చెందిన ఓ యువతి, యువకు డు రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారని గ్రామస్తుల ద్వారా తెలి సింది. కొద్ది రోజులు వారి సంసారం సాఫీగా సాగినా ఆ తరువాత కుటుం బ కలహాల తో విడిపోయారని సమాచారం. అప్పటికే వారికి ఓ పాపం పుట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం వారి ద్దరూ వేర్వేరుగా ఉంటుండగా, పాప పోషణ భారం కావడంతో బిడ్డను అనాథను చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement