baddalapuram
-
వివాహిత ఆత్మహత్య
కనగానపల్లి (రాప్తాడు) : కనగానపల్లి మండలం బద్దలాపురంలో జింకల నరసింహులు భార్య ఉమక్క(30) అనే వివాహిత శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రామారావు తెలిపారు. ఆమె ఆరు నెలలుగా కడుపు నొప్పితో బాధపడేదన్నారు. పలుచోట్ల వైద్యం చేయించినా ఆరోగ్యం కుదుటపడకపోగా, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని తనువు చాలించిందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమాస్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
అయ్యో.. పాపం!
→ కలహాలతో విడిపోయిన దంపతులు? → అనాథగా మారిన ఏడాదిన్నర చిన్నారి → శిశుసదన్కు తరలించిన ఐసీడీఎస్ అధికారులు కనగానపల్లి : రెండేళ్ల చిన్నారికి ఎంత కష్టమొచ్చిందో.. ఏ పాపం ఎరుగని ఆ చిన్నా రి అనాథగా మారింది. అమ్మానాన్న మధ్య తలెత్తిన మనస్పర్ధలు ఆ చిన్నారిని ఒంటరి చేశాయి. ఏడాదిన్నర వయస్సు కలిగిన ఆ పాపను కనగానపల్లి మండ లం బద్దలాపురం ఎస్సీ కాలనీ సమీపంలో కన్నవారు శుక్రవారం ఉదయం ఒంటరిగా వదిలివెళ్లిపోయారని గ్రామస్తులు తెలిపారు. ఏడుస్తూ కనిపించిన పాపను స్థా నికులు గమనించి చేరదీశా రు. చుట్టుపక్కల వారిని విచారించారు. విష యం తెలుసుకున్న అంగన్వాడీ వర్క ర్లు ఐసీడీఎస్ అధికారుSకు సమాచా రం అందించారు. సీడీపీఓ వనజాక్షి, సూపర్వైజర్ మీనాక్షమ్మ హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. పాప ను అనంతపురంలోని బాలశిశుసదన్కు తరలించారు. అయితే బద్దలాపురానికి చెందిన ఓ యువతి, యువకు డు రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారని గ్రామస్తుల ద్వారా తెలి సింది. కొద్ది రోజులు వారి సంసారం సాఫీగా సాగినా ఆ తరువాత కుటుం బ కలహాల తో విడిపోయారని సమాచారం. అప్పటికే వారికి ఓ పాపం పుట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం వారి ద్దరూ వేర్వేరుగా ఉంటుండగా, పాప పోషణ భారం కావడంతో బిడ్డను అనాథను చేసినట్లు తెలుస్తోంది.