ఐసీడీఎస్ సిబ్బందికి ఆడశిశువును అప్పగిస్తున్న రైల్వే పోలీసులు
మహబూబ్‌నగర్ క్రైం : ఓ రైలులో గుర్తుతెలియని వ్యక్తులు తొమ్మిది నెలల ఆడశిశువును వదిలిపెట్టి వెళ్లారు. రైల్వే ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్ కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం గుంటూరు నుంచి కాచిగూడ వరకు వెళుతున్న ఫ్యాసింజర్ రైలు మహబూబ్‌నగర్ స్టేషన్‌లో ఆగింది. అదే సమయంలో తొమ్మిది నెలల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. కొద్దిసేపటికి అక్కడి ప్రయాణికులు గమనించి వెంటనే రైల్వేపోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు ముస్తాక్, షర్మిల పాల్గొన్నారు.