రెండు జిల్లాల పరిధిలోకి రూరల్ ఐసీడీఎస్
Published Mon, Sep 5 2016 12:08 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టరేట్‌లోని హన్మకొండ రూరల్ ఐసీడీఎస్ కార్యాలయం పరిస్థితి అయోమయంగా ఉంది. ఈ కార్యాలయ పరిధిలో మెుత్తం 310 అంగన్‌వాడీ కేంద్రా లు, ఏడుగురు సూపర్‌వైజర్లు ఉన్నారు. పేరుకు రూరల్ కార్యాలయమైనా అర్బన్‌లోని విలీన గ్రామాల్లో సుమారు వంద అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. హన్మకొండ, వరంగల్, ఆత్మకూరు, గీసుకొండ, హసన్‌పర్తి మండలాల పరిధిలో అంగన్‌వాడీ కేంద్రా లు ఉన్నాయి. ప్ర స్తుతం విభజనతో ఐనవోలు, కాజీపేట, ఖిలావరంగల్ మండలాల్లోకి కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలు చేరుతున్నాయి. ఇక హన్మకొండ జిల్లా పరిధిలోకి హన్మకొండ, ఐనవోలు, కాజీపేట మండలాల్లోని 59, వరంగల్ జిల్లా పరిధిలోకి వరంగల్, ఆత్మకూరు, గీసుకొండ, ఖిలావరంగల్ మండలాల్లోని 251 అంగన్‌వాడీ కేంద్రాలు వస్తున్నా యి. ఐసీడీఎస్ పీడీ కార్యాలయ పరిధిలో పనిచేస్తుంది. అయితే ఇప్పుడు రెండు జిల్లాల పరిధిలోకి కేంద్రాలు వస్తున్నందున అధికారులు విభజన విషయంలో తలలు పట్టుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో పను లు పూర్తి చేసి తుది నివేదిక అధికారులకు అందజేస్తామని సీడీపీవో శైలజ తెలిపారు. వరంగల్ జిల్లాలోని 251 కేంద్రాలు వెళ్తుండటం తో మిగిలేది 59 అంగన్‌వాడీ కేం ద్రాలు మాత్రమే కావడంతో కార్యాలయం భవితవ్యం ఏమిటనేది తేలాల్సి ఉంది.
Advertisement
Advertisement