భ్రూణహత్యల నివారణకు కృషి చేయాలి | Must work to prevent abortion | Sakshi
Sakshi News home page

భ్రూణహత్యల నివారణకు కృషి చేయాలి

Published Sat, Oct 15 2016 11:48 PM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

భ్రూణహత్యల నివారణకు కృషి చేయాలి - Sakshi

భ్రూణహత్యల నివారణకు కృషి చేయాలి

 బద్వేలు అర్బన్‌: భ్రూణహత్యల నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అపుడే సమాజంలో  ఆడపిల్లల నిష్పత్తిని పెంచేందుకు సాధ్యమవుతుందని ఐసీడీఎస్‌ పీడీ రాఘవరావు, ఐసీపీఎస్‌ పీడీ శివక్రిష్ణ అన్నారు. శనివారం  స్థానిక ఎన్‌జీవోహోంలో  ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో బేటీబచావో– బేటీ పడావో కార్యక్రమంపై నిర్వహించిన శిక్షణ  కార్యక్రమంలో  వారు మాట్లాడుతూ  సాధ్యమైనంత వరకు  లింగనిర్ధారణ పరీక్షలు  చేయించకుండా మహిళలను చైతన్య పరచాలన్నారు. అలాగే బాల్య వివాహాల వలన కూడా లేనిపోని సమస్యలు , ఇబ్బందులు తలెత్తుతాయని దీనిపై కూడా ప్రత్యేక దృష్టిసారించి  బాల్య వివాహాలను నిరోధించాలన్నారు.అలాగే  ఆడ పిల్లలను చదివించాలని కోరారు.   అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ సోమేసుల పార్థసారథి మాట్లాడుతూ ప్రస్తుతం మహిళల సంక్షేమం కోసం అనేక రకాల చట్టాలు ఉన్నాయని వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకున్నప్పుడే మహిళలు సమాజంలో రాణించగలుగుతారని అన్నారు.  కార్యక్రమంలో  ఐసీడీఎస్‌ సీడీపీఓ రాజమ్మ , సూపర్‌వైజర్‌లు సరళాదేవి, వెంకటసుబ్బమ్మ, సుభద్ర, అంగన్వాడీ వర్కర్లు్ల పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement