పురిట్లో బిడ్డను పక్కన పెట్టేసి కనికరం లేకుండా వెళ్లిపోయిందో తల్లి.
పురిట్లో బిడ్డను పక్కన పెట్టేసి కనికరం లేకుండా వెళ్లిపోయిందో తల్లి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కంభంలోఇన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానిక ఆస్పత్రికి గత నెల 27న పురిటి నొప్పులతో వచ్చిన మహిళ ఆడపిల్ల పుట్టిన కొద్దిసేపటికి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఎంతకి తిరిగి రాకపోవడంతో.. ఆస్పత్రి యాజమన్యం ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు పాపకు వైద్య చికిత్సలు చేయించి తీసుకెళ్లారు.